ETV Bharat / business

కరోనాపై పోరుకు శాంసంగ్ ఇండియా రూ.20 కోట్ల విరాళం

author img

By

Published : Apr 14, 2020, 7:26 PM IST

కరోనాపై పోరుకోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్​కు భారీ విరాళాలు అందుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఇండియా రూ.15 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉత్తర్​ ప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలకు కలిపి మరో రూ.5 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Samsung India pledges Rs 20 crore towards COVID-19 efforts
పీఎం కేర్స్​కు శాంసంగ్ భారీ విరాళం

దేశంలో కరోనాపై పోరుకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ తయారీ దిగ్గజం శాంసంగ్​ ఇండియా రూ.20 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అందులో రూ.15 కోట్లు పీఎం కేర్స్​కు, ఉత్తర్​ప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలకు కలిపి రూ.5 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.

శాంసంగ్ ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందకుండా వాడే పలు వైద్య ఉపకరణాలు, థర్మామీటర్లు, ఎయిర్​ ప్యూరిఫయర్ల వంటి వాటిని సమకూరుస్తోంది.

ఉద్యోగుల విరాళం..

కంపెనీతో పాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులు తమ వేతనాల్లో కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. రానున్న వారాల్లో ఉద్యోగుల, కంపెనీ విరాళం పీఎం కేర్స్​కు బదిలీ చేయనున్నట్లు శాంసంగ్ స్పష్టం చేసింది.

గివ్​ఇండియాకు భారీ స్పందన..

ప్రస్తుత విపత్తుపై పోరాటానికి విరాళాలు సేకరిస్తున్న 'గివ్​ఇండియా' 'కొవిడ్​- 19 రెస్పాన్స్ ఫండ్​'ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తొలి దశలోనే రూ.75 కోట్లు సమకూరినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:10 శాతం ఐటీ ఉద్యోగాలకు కరోనా గండం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.