ETV Bharat / business

ఇక స్మార్ట్​ వాచ్​లోనే ఈసీజీ పరీక్ష

author img

By

Published : May 26, 2020, 3:09 PM IST

శాంసంగ్ 'హెల్త్ మానిటర్' యాప్​కు దక్షిణ కొరియా ఆహార, ఔషధ భద్రత మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. తాజా ఫీచర్....​ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్​ వాచ్​ యాక్టివ్​ 2 కోసం రూపొందించారు. దీనితో వినియోగదారుడు ఈసీజీ పరీక్ష ద్వారా స్వయంగా తన గుండె లయను, రక్తపోటును తెలుసుకోగలుగుతాడు.

Samsung Galaxy Watch Active 2 to have ECG feature, approval by South Korea MFDS
శాంసంగ్ గెలాక్సీ 'ఈసీజీ' ఫీచర్​కు ఆమోదం

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్​ వాచ్​ యాక్టివ్​ 2లో 'ఈసీజీ' ఫీచర్​ను అనుసంధానించడానికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ భద్రత మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. అలాగే 'హెల్త్ మానిటర్' యాప్​ ఉపయోగించి రక్తపోటు పరీక్షలు నిర్వహించడానికి కూడా క్లియరెన్స్ ఇచ్చింది.

"శాంసంగ్ గెలాక్సీ వాచ్​ యాక్టివ్ 2లో ఈసీజీ ఫీచర్ అనుసంధానించడానికి అనుమతి లభించినందుకు ఆనందంగా ఉంది. ఇకపై మా వినియోగదారులు హెల్త్ మానిటర్ యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకొని.. బటన్​పై లాంగ్ ప్రెస్​ చేసి ఈసీజీ రీడింగ్ తెలుసుకోవచ్చు. అంటే వినియోగదారులు స్వయంగా తమ గుండె లయను, రక్తపోటును తెలుసుకోగలుగుతారు. "

- శాంసంగ్ ట్వీట్​

మీ ఆరోగ్య సమాచారం... మీ చేతుల్లో

"శాంసంగ్ గెలాక్సీ వాచ్​ యాక్టివ్ 2... అత్యున్నత హార్డ్​వేర్, సాఫ్ట్​వేర్​ల కలయిక. దీని కోసం రూపొందించిన 'హెల్త్ ​మానిటర్' ఫీచర్​తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గెలాక్సీ వినియోగదారులు స్వయంగా తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకుని తెలుసుకోవచ్చు" అని శాంసంగ్ తెలిపింది.

తాజా హెల్త్ మానిటర్ ఫీచర్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని శాంసంగ్ తెలిపింది. గెలాక్సీ వాచ్​ తరువాతి మోడళ్లలోనూ ఇది అప్​గ్రేడ్ అవుతుందని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనాతో ఆదాయం డౌన్​.. ఏం చేయాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.