దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ నోట్20 సిరీస్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. అన్నీ సజావుగా సాగితే ఆగస్టు 5వ తేదీన దీనిని విపణిలోకి తీసుకురానుంది. దీనికోసం వర్చువల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఫోన్ ధర కూడా గెలాక్సీ నోట్10తో పోలిస్తే చౌకగా ఉండే అవకాశాలున్నాయి.
ఈ సిరీస్ ఫోన్ల విడుదల ఈవెంట్ గురించి చెబుతూ శాంసంగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ కారణంగా స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ తగ్గడంతో నోట్20, నోట్20 అల్ట్రా ధరలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. దీంతో నోట్ 10ను రూ.78,300కు విక్రయిస్తుండగా.. నోట్ 20 ధర అంతకంటే తక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లలో ప్రాంతాన్ని బట్టి స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ గానీ, ఎగ్జినోస్ 990 ప్రాసెసర్‌గానీ ఉండొచ్చు. వీటిల్లో 16జీబీ ఎల్‌పీడీడీఆర్5 రామ్‌ను వాడింది. శాంసంగ్ వీటి ఉత్పత్తిని భారీ స్థాయిలో చేస్తోంది.
ఇదీ చూడండి:మార్కెట్లోకి గూగుల్ కొత్త ప్రొడక్ట్ ఇదేనా?