ETV Bharat / business

ప్రీమియం స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో శాం​సంగ్​దే అగ్రస్థానం!

స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం శాం​సంగ్​... ఇండియన్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో దుమ్ములేపుతోంది. చైనా సంస్థల నుంచి పోటీ ఎదుర్కొంటూనే అగ్రస్థానం సొంతం చేసుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇక సూపర్​-ప్రీమియం విభాగంలో యాపిల్​ తన ఆధిపత్యం ప్రదర్శించింది.

Samsung captures India premium smartphone market
ప్రీమియం స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో శామ్​సంగ్​దే అగ్రస్థానం!
author img

By

Published : Aug 29, 2020, 7:22 PM IST

భారతీయ మార్కెట్​లో చైనా సంస్థల హవాను తట్టుకొని సత్తాచాటుతోంది దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ప్రీమియం స్మార్ట్​ఫోన్(రూ.25 వేల నుంచి రూ.50 వేలు) మార్కెట్​లో టాప్​-1లో నిలిచినట్లు సీఎంఆర్​ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. ఇక సూపర్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్​(రూ.50 వేల నుంచి రూ.1లక్ష) విభాగంలో యాపిల్​ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో యాపిల్​ సంస్థ మొత్తం 56 శాతం మార్కెట్​ షేర్​ సంపాదించినట్లు అందులో పేర్కొన్నారు.

ఆ ఫోన్లతో దూకుడు...

శాంసంగ్​... గెలాక్సీ ఏ71, ఏ51 ఫోన్ల ద్వారా ప్రీమియం మార్కెట్​ను ఆకర్షించుకోగలిగిందని సీఎంఆర్​ ఇండియా తన నివేదికలో స్పష్టం చేసింది. దాదాపు 37 శాతం మార్కెట్ షేర్​ను ఈ సంస్థ సొంతం చేసుకుంది. యాపిల్ ఏకంగా 14 శాతం మెరుగై..​ 26 శాతం మార్కెట్​ షేర్​తో రెండో ర్యాంక్​లోనూ,15 శాతం షేర్​తో వన్​ ప్లస్​ మూడో స్థానంలో నిలిచింది.

"కరోనా వల్ల ఈ ఏడాది తొలి అర్ధభాగం స్మార్ట్​ఫోన్ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ప్రీమియం స్మార్ట్​ఫోన్​ విభాగానికి మాత్రం పెద్దగా ఇబ్బంది రాలేదు. ఈ విభాగంలో కస్టమర్​ డిమాండ్​ సహా సప్లయ్​ బాగా ఉంది.''

-- ఆనంద్​ ప్రియా సింగ్​, ఐఐజీ-సీఎంఆర్ విశ్లేషకులు

ప్రీమియం విభాగంలో.. తొలి ఆరు నెలల్లో దాదాపు 18 శాతం అభివృద్ధి నమోదైనట్లు సీఎంఆర్​ నివేదిక పేర్కొంది. ఇది మొత్తం స్మార్ట్​ఫోన్​ షిప్​మెంట్​లో 5 శాతమని స్పష్టం చేశారు. శాంసంగ్​కు మంచి సప్లయ్​ డైనమిక్స్​ సహా డిస్కౌంట్లు, స్మార్ట్​ ఛానల్​ స్ట్రాటజీ వల్ల మెరుగైనట్లు తెలిపారు. ప్రీమియం విభాగంలో గెలాక్సీ ఏ71 దాదాపు 19 శాతం మార్కెట్​ సంపాదించినట్లు పేర్కొన్నారు.

ఐఫోన్​-11 వల్ల యాపిల్​ కూడా తనదైన రీతిలో దూసుకెళ్తోంది. ఈ ఫోన్​ రానున్న ఆరు నెలల్లో దాదాపు 8 శాతం ప్రీమియం మార్కెట్​ షేర్​ను సాధిస్తుందని అంచనా వేశారు. వచ్చే ఆరు నెలల్లో పండగలు బాగా ఉండటం వల్ల ప్రీమియం విభాగం మార్కెట్​​లో అన్ని సంస్థలు కలిపి 20 శాతం అభివృద్ధి సాధిస్తాయని నిపుణులు అంచనా వేశారు.

సూపర్​ ప్రీమియంలో యాపిల్​ టాప్​...

సూపర్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్​(రూ.50 వేల నుంచి రూ.1లక్ష) విభాగంలో యాపిల్​ అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు 56 శాతం మార్కెట్​ షేర్​ సొంతం చేసుకుంది. ఇందులో 39 శాతం ఐఫోన్​-11 ద్వారానే వచ్చినట్లు ఆ నివేదిక వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో శాంసంగ్​(34 శాతం), వన్​ప్లస్​(4 శాతం) నిలిచింది. ఇది తొలి ఆరు నెలల్లో జరిగిన మొత్తం స్మార్ట్​ఫోన్ షిప్​మెంట్లలో​ 2 శాతం అని సీఎంఆర్​ నివేదిక తెలిపింది.

ఉబర్​-ప్రీమియం(రూ.1లక్ష పై ధర ఉన్న ఫోన్లు)మార్కెట్​లో యాపిల్​ 67 శాతం షేర్​ను సొంతం చేసుకోగా.. శాంసంగ్​ 30 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.