ETV Bharat / business

ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న వేతనాలు..!

2020లో దేశంలోని ఉద్యోగుల వేతనాలలో భారీగా పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని ఓ నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా వాస్తవ వేతన పెరుగుదల భారత్​లోనే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. 130 దేశాలలోని వివిధ సంస్థల్లో పనిచేసే దాదాపు 2 కోట్ల ఉద్యోగుల సమాచారాన్ని విశ్లేషించి కోర్న్​ ఫెర్నీ గ్లోబల్​ శాలరీ ఫోర్​కాస్ట్​ ఈ నివేదిక రూపొందించింది.

Salaries in India likely to rise by 9.2 pc in 2020; Inflation-adjusted real-wage at 5 pc: Report
ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న వేతనాలు..!
author img

By

Published : Dec 2, 2019, 7:42 PM IST

2020లో దేశంలోని ఉద్యోగుల జీతాలు దాదాపు 9.2 శాతం పెరగనున్నట్లు కోర్న్​ ఫెర్రీ గ్లోబల్ శాలరీ ఫోర్​కాస్ట్ నివేదిక అంచనా వేసింది. అయితే ద్రవ్యోల్బణం ఈ పెరుగుదలపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం కారణంగా నికర పెరుగుదల కేవలం 5 శాతమే ఉండనున్నట్లు వెల్లడించింది. 130 దేశాల్లోని 25 వేల సంస్థల్లో పనిచేసే దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగుల సమాచారాన్ని విశ్లేషించి నివేదిక రూపొందించింది కోర్న్​ ఫెర్రీ.

"ప్రపంచ వ్యాప్తంగా వాస్తవ వేతనంలో తగ్గుదల నమోదైనా భారత్​ స్థిరమైన వేతన వృద్ధి సాధించింది. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ తీరు గమనిస్తే వేతనాల పెరుగుదల కొనసాగే అవకాశం ఉండొచ్చని భారత మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి."-నవ్​నీత్ సింగ్, ఛైర్మన్, కోర్న్​ ఫెర్రీ ఇండియా.

కోర్న్​ ఫెర్రీ గ్లోబల్ శాలరీ ఫోర్​కాస్ట్ అంచనా ప్రకారం గతేడాది (10శాతం)తో పోలిస్తే దేశంలోని ఉద్యోగుల సగటు వేతనాలు పెరుగుదల తగ్గుముఖం పట్టనున్నట్లు పేర్కొంది. అయినప్పటికీ ఆసియా దేశాలలో భారత్​లోనే అధిక వేతన పెరుగుదల నమోదు కానున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవ వేతనంలో పెరుగుదల ప్రపంచంలో భారతదేశంలోనే అధికం కావడం గమనార్హం.

"భారత్​లో వేతనాల సగటు పెరుగుదల 2020 సంవత్సరంలో 9.2శాతం ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండటం వల్ల వాస్తవ వేతనం కూడా ప్రపంచంలోనే అత్యధిక పెరుగుదల(5.1శాతం) భారత్​లోనే నమోదైంది."
-రూపాంక్​ చౌధరీ, అసోసియేట్ క్లైంట్ పార్ట్​నర్, కోర్న్​ ఫెర్రీ అధికారి.

ఇతర ఆసియా దేశాలైన ఇండోనేసియాలో 8.1శాతం, మలేసియాలో 5 శాతం, చైనాలో 6 శాతం, కొరియాలలో 4.1 శాతం వేతన పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

2020లో ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుదల కేవలం 4.9 శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఏడాదిలో ద్రవ్యోల్బణం 2.8 శాతం ఉండగా... వాస్తవ వేతనంలో పెరుగుదల 2.1 శాతంగా ఉండనున్నట్లు వెల్లడించింది.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Monday, 2 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0223: HZ Australia Flower Farm No access Australia 4242367
Australian farmers replace crops with flower field
AP-APTN-0223: HZ Kenya Grevy's Zebra AP Clients Only 4242392
COP 25 : Grevy's zebra threatened by climate change
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.