భారత్‌లో.. స్పుత్నిక్-వీ క్లినికల్ ట్రయల్స్‌తో పాటు 10 కోట్ల టీకా డోసుల సరఫరాకు ఆర్డీఐఎఫ్(రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి)- డా. రెడ్డీస్ ల్యాబొరేటరీ మధ్య ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే.. 10 కోట్ల డోసులను రెడ్డీస్ ల్యాబ్‌కు ఆర్డీఐఎఫ్ సరఫరా చేయనుంది. 2020 చివరి నాటికి ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది.
ఈ ఒప్పందంపై రెడ్డీస్ ల్యాబ్ కో-ఛైర్మన్ జీవీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
"భారత్‌కు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు ఆర్డీఐఎఫ్తో చేతులు కలపడం ఎంతో సంతోషంగా ఉంది. తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాల్ని ఇచ్చాయి. వ్యాక్సిన్ భద్రత, భారత జనాభాపై వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను మేము నిర్వహిస్తాం. దేశంలో కరోనాపై పోరుకు స్పుత్నిక్-వీ ఓ ఆశాకిరణంగా మారే అవకాశముంది."
--- జీవీ ప్రసాద్, రెడ్డీస్ ల్యాబ్ కో-ఛైర్మన్.
ఆర్డీఐఎఫ్ ఇప్పటికే.. కజికిస్థాన్, బ్రెజిల్, మెక్సికోకు రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీని అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఇదీ చూడండి:- ప్రజా పంపిణీకి రష్యా వ్యాక్సిన్- తొలిబ్యాచ్ విడుదల