ETV Bharat / business

రైల్వే బంపర్​ ఆఫర్​: ప్లాస్టిక్ ఇస్తే ఫ్రీగా మొబైల్​ రీఛార్జ్​ - ప్లాస్టిక్ నిషేధం

రైల్వే ప్రయాణికులకు బంపర్​ ఆఫర్​. రైల్వేశాఖ మీ ఫోన్లను రీఛార్జ్​ చేయనుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా రైల్వే స్టేషన్లలోని ప్లాస్టిక్ క్రషింగ్ మెషీన్లలో.. మీరు వాడిపారేయదలచిన ప్లాస్టిక్ సీసాలను వేయడమే.

రైల్వే బంపర్ ఆఫర్​లతో.. మీ ఫోన్​ రీఛార్జ్​
author img

By

Published : Sep 10, 2019, 3:43 PM IST

Updated : Sep 30, 2019, 3:25 AM IST

రైల్వే బంపర్​ ఆఫర్​: ప్లాస్టిక్ ఇస్తే ఫ్రీగా మొబైల్​ రీఛార్జ్​

రైల్వేశాఖ తన ప్రయాణికులకు బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్​ సీసాల క్రషింగ్​ యంత్రాలు వినియోగించినవారికి ఫోన్ రీఛార్జ్​ చేయనున్నట్లు తెలిపింది.

స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకూడదని, ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిని అనుసరించి ఈ ఏడాది అక్టోబర్​ 2 నుంచి స్టేషన్​ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ రైల్వే ఆదేశాలు జారీచేసింది.

ఎంత రీఛార్జ్​ చేస్తారు?

రైల్వే స్టేషన్లలో 400 ప్లాస్టిక్ సీసాల క్రషింగ్​ యంత్రాలు ఏర్పాటు చేస్తామని రైల్వే బోర్డ్ ఛైర్మన్​ వీకే యాదవ్​ తెలిపారు. ప్రస్తుతానికి 128 స్టేషన్లలో 160 యంత్రాలు అమర్చినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు వీటిని వినియోగించి ప్లాస్టిక్ సీసాలు క్రషింగ్ చేస్తే వాళ్ల ఫోన్లు రీఛార్జ్ చేస్తామని వెల్లడించారు. అయితే ఎంత మొత్తం రీఛార్జ్​ చేస్తారనేది మాత్రం ఇంకా చెప్పలేదు.

రైల్వే స్టేషన్లలోని వాడిపారేసిన ప్లాస్టిక్ సీసాలు సేకరించి.. రీసైక్లింగ్​కు పంపించాలని సిబ్బందికి సూచించినట్లు యాదవ్​ స్పష్టం చేశారు.

పునర్వినియోగించేలా..

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పునర్వినియోగ సంచులను ఉపయోగించాలని ఇప్పటికే రైల్వే మంత్రిత్వశాఖ తన నెట్​వర్క్​లోని విక్రేతలకు, సిబ్బందికి సూచించింది. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్​ 2 నుంచి ప్లాస్టిక్​ బాటిళ్ల నిషేధం అమలులోకి రానుంది.

ఇదీ చూడండి: 'భారత్​-నేపాల్​ స్నేహ వారథిగా చమురు పైప్​లైన్​'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 3:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.