ఈ ఏడాది నెలకొన్న సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గట్టెక్కాలంటే సంస్కరణలు ఎంతో కీలకమని రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ గ్లోబర్ అభిప్రాయపడింది. మధ్య నుంచి దీర్ఘకాలంలో భారత్ 6.5-7 శాతం వరకు వృద్ధిని సాధించే సత్తా ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.
వర్ధమాన దేశాల్లో మైరుగైన పనితీరు...
వరుసగా 13వ ఏడాదీ భారత్‌కు తక్కువ పెట్టుబడి గ్రేడ్ రేటింగ్‌నే కొనసాగించిన ఎస్&పీ ఒక వెబినార్‌లో ఈ విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది వృద్ధి డీలా పడ్డా.. వర్ధమాన దేశాల్లో మెరుగైన పనితీరును కనబరచడానికి భారత్‌కు అవకాశాలున్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 5% క్షీణతను నమోదు చేయవచ్చని; వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం 8.5% వృద్ధిని సాధించవచ్చని రేటింగ్ ఏజెన్సీ అంచనా కట్టింది.
కరోనా విధ్వంసం సృష్టిస్తే..
ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి మరింత విధ్వంసానికి ఒడిగడితే మాత్రం భారత రేటింగ్‌ను తగ్గించకుండా ఉండలేమని.. అందుకు ఈ గణాంకాలు అడ్డురాబోవని స్పష్టం చేసింది ఎస్&పీ.