ETV Bharat / business

Aramco Reliance: రిలయన్స్​లో అరామ్‌కోకు 20% వాటా!

రిలయన్స్‌లో దాదాపు 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కో(Aramco Reliance) సొంతం చేసుకోవచ్చని 'బ్లూమ్‌బర్గ్‌' వార్తా సంస్థ తెలిపింది. ప్రతిగా అరామ్‌కోలో ఆర్‌ఐఎల్‌కు వాటా దక్కనుందని చెప్పింది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈమేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ షేర్లు సోమవారం లాభాలందుకున్నాయి.

Aramco
అరామ్‌కో
author img

By

Published : Aug 17, 2021, 5:53 AM IST

Updated : Aug 17, 2021, 6:34 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్​లో(ఆర్‌ఐఎల్‌) (Aramco Reliance) వాటా కొనుగోలుకు సౌదీ అరామ్‌కో సిద్ధమైంది. మొత్తం షేర్ల రూపంలో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆ సంస్థ జరుపుతున్న చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని ఈ పరిణామాలతో సంబంధమున్న వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ 'బ్లూమ్‌బర్గ్‌' తెలిపింది. 'రిలయన్స్‌లో దాదాపు 20 శాతం వాటాను అరామ్‌కో సొంతం చేసుకోవచ్చు. దీని విలువ 20 బిలియన్‌ డాలర్ల నుంచి 25 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1.5-1.87 లక్షల కోట్లు) వరకు ఉండొచ్చ'ని ఆ వర్గాలు అంటున్నాయి. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రాబోయే వారాల్లో అరామ్‌కోతో ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ షేర్లు లాభాలందుకున్నాయి కూడా.

రిలయన్స్‌కు 1 శాతం వాటా?

ఈ ఒప్పందం ఫలితంగా తన రిఫైనరీలకు ఏ ఇబ్బంది లేకుండా ముడి చమురు సరఫరాను ఆర్‌ఐఎల్‌ పొందొచ్చు. అదే సమయంలో అరామ్‌కోలో వాటాదారుగానూ మారొచ్చు. అరామ్‌కో మార్కెట్‌ విలువ 1.9 లక్షల కోట్ల డాలర్లను పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్‌కు అందులో 1 శాతం వాటా దక్కే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఈ లావాదేవీ ఇంకా చర్చల దశలోనే ఉందని.. అందుకు మరింత ఎక్కువ సమయం పట్టడానికి, లేదంటే మధ్యలోనే ఆగిపోవడానికీ అవకాశాలున్నాయని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

స్పందించని అరామ్‌కో

ఒప్పంద చర్చలపై స్పందించడానికి అరామ్‌కో తిరస్కరించింది. సౌదీ ప్రభుత్వానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్‌ ప్రస్తుతానికి ఎటువంటి స్పందనా తెలపలేదు. మరో వైపు రిలయన్స్‌ ప్రతినిధిని సంప్రదించగా.. జూన్‌లో జరిగిన వాటాదార్ల సమావేశంలో అంబానీ చెప్పిన అంశాలకు అదనంగా జతచేర్చడానికి ఏమీలేదన్నారు. ఆర్‌ఐఎల్‌ బోర్డులోకి అరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌-రుమయ్యన్‌ను నియమిస్తున్నట్లు ఆ సమావేశంలో అంబానీ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటామని కూడా ఆయన తెలిపారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, ఈ ఏడాదిలోనే ఒప్పందం పూర్తి కావొచ్చని అరామ్‌కో గత వారం పేర్కొనడం గమనార్హం.

ఇదీ చూడండి: పెట్రోల్​ ధరలను గత ప్రభుత్వంలా మేం తగ్గించలేం: నిర్మల

ఇదీ చూడండి: యువత.. పెట్టుబడులు పెడుతున్నారా?

Last Updated : Aug 17, 2021, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.