ETV Bharat / business

జియో సేవలకు అంతరాయం- యూజర్లకు ఇబ్బందులు! - నిలిచిన జియో సేవలు

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సేవలకు పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. సిగ్నల్​ ఉన్నప్పటికీ.. యూజర్లు ఫోన్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని 'డౌన్‌డిటెక్టర్‌' పేర్కొంది. మధ్యాహ్నం సమయంలో ఈ సమస్య తీవ్రమైనట్లు తెలిపింది.

Jio Services down
జియో సేవలకు అంతరాయం
author img

By

Published : Oct 6, 2021, 4:05 PM IST

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ సేవలకు బుధవారం మధ్యహ్నం వరకు అంతరాయం ఎదురయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని 'డౌన్‌డిటెక్టర్‌' వెల్లడించింది. నెట్‌వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది.

జియో నెట్‌వర్క్‌లో అంతరాయంపై వినియోగదారులు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. భారత్‌లో జియోడౌన్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నట్లు డౌన్‌ డిటెక్టర్‌ తెలిపింది. దాదాపు 4 వేల మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌ సమస్యను రిపోర్ట్ చేసినట్లు పేర్కొంది. ట్విట్టర్‌ పోస్టులను బట్టి చూస్తే.. బుధవారం ఉదయం నుంచి కనెక్టివిటీ సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. దాంతో రిలయన్స్ జియో కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదుల తాకిడి పెరిగినట్లు తెలిపింది డౌన్​ డిటెక్టర్​. ఈ సమస్య తాత్కాలికమేనని, పరిష్కారం కోసం తమ బృందం పనిచేస్తున్నట్లు కస్టమర్ కేర్ నుంచి సమాధానం వచ్చినట్లు చెప్పింది.

ఏ ప్రాంతాల్లో ఎక్కువ సమస్యలు..?

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో జియో సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో సిగ్నల్​ కావాల్సినంత ఉన్నప్పటికీ.. ఫోన్ చేయలేకపోవడం వంటి సమస్యలు వచ్చినట్లు వెల్లడైంది. దీనిపై జియో నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇదీ చదవండి: అయ్యో మార్క్​.. రాత్రికి రాత్రే రూ.52 వేల కోట్లు లాస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.