ETV Bharat / business

టీసీఎస్​ను వెనక్కినెట్టి మళ్లీ నెంబర్​వన్​గా రిలయన్స్​

మరోసారి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(టీసీఎస్​)ను వెనక్కినెట్టి భారత్​లో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది రిలయన్స్​ ఇండస్ట్రీస్​. శుక్రవారం ట్రేడింగ్​లో టీసీఎస్​ షేర్లు భారీగా పడిపోవడమే దీనికి కారణం.

author img

By

Published : Jan 30, 2021, 5:20 AM IST

దేశంలో అత్యంత విలువైన కంపెనీగా మరోసారి రిలయన్స్​ ఇండస్ట్రీస్​ నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(టీసీఎస్​)ను అధిగమించి.. అతిపెద్ద లిస్టెడ్​ కంపెనీగా అవతరించింది.

రిలయన్స్​ మార్కెట్​ క్యాపిటల్​(ఎం-క్యాప్​) రూ. 11,68,454.02 కోట్లుగా ఉంది. టీసీఎస్​ ఎం-క్యాప్​ రూ.11,68,079.84 కోట్లుగా ఉంది. ఇది రిలయన్స్​ కంటే దాదాపు రూ.375 కోట్లు తక్కువ.

ఈ సోమవారమే.. టీసీఎస్​ దేశీయ అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా రెండోసారి అవతరించింది. అయితే.. శుక్రవారం(జనవరి 29) ట్రేడింగ్​లో ఈ సంస్థ షేర్లు 2.71 శాతం క్షీణించిన కారణంగా ఎం-క్యాప్​ తగ్గి రెండో స్థానానికి పడిపోయింది.

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేరు కూడా.. శుక్రవారం సెషన్​లో 1.78 శాతం పతనమైంది.

ఇదీ చూడండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.