రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సోమవారం దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. రెండు ట్రేడింగ్ సెషన్ల అనంతరం లాభాలను ఆర్జించిన ఆర్ఐఎల్... మార్కెట్ విలువ ప్రకారం సాఫ్ట్వేర్ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్'ను అధిగమించింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) ప్రకారం... మార్కెట్ ముగింపు సమయానికి ఆర్ఐల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.7,98,385.98 కోట్లుగా ఉంది. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాపిటలైజేషన్ రూ.7,85,880.69 కోట్లు. అంటే టీసీఎస్ కంటే ఆర్ఐఎల్ విలువ రూ.12,505.29 కోట్లు అధికం.
నష్టాల నుంచి లాభాల్లోకి
మార్కెట్ క్యాపిటలైజేషన్లో ప్రథమ స్థానంలో నిలవడానికి రిలయన్స్, టీసీఎస్ ఎప్పటి నుంచో పోటీపడుతూనే ఉన్నాయి. ఆర్ఐఎల్ షేర్లు కొద్ది రోజుల క్రితం వరకు నష్టాలు చవిచూశాయి. ఫలితంగా... గత గురువారం టీసీఎస్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. కొద్ది రోజుల్లోనే ఆ పరిస్థితిని తారుమారు చేసింది రిలయన్స్.
దేశీయ మార్కెట్లో ( ఎమ్-క్యాప్) ప్రస్తుతం ఆర్ఐఎల్ అగ్రస్థానంలో ఉండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ (రూ.6,24,089.61 కోట్లు), హెచ్‌యూఎల్ (రూ.3,66,787.51 కోట్లు), ఐటీసీ (రూ.3,60,4.3.77 కోట్లు)తో తరువాత స్థానాల్లో ఉన్నాయి.
స్టాక్‌మార్కెట్‌ను (లాభ, నష్టాలు) అనుసరించి కంపెనీల ఎమ్-క్యాప్ విలువలు ప్రతిరోజు మారుతుంటాయి.
ఇదీ చూడండి: మదుపరుల అప్రమత్తత- మళ్లీ నష్టాలు