స్పుత్నిక్ వి టీకా వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రకటించింది. రష్యా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లో జరుగుతున్న క్లినికల్ పరీక్షలు మార్చిలో పూర్తవుతాయని సంస్థ గ్లోబల్ హెడ్ ఠాకూర్ పేర్వానీ అంచనా వేశారు.
తొలిదశలో 10లక్షల టీకాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. స్పుత్నిక్ టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే ఆ దేశంలో సామూహిక వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది.
ఇదీ చూడండి: మా టీకా 95 శాతం సమర్థవంతం: పుతిన్