ETV Bharat / business

ఆఫీసు స్థలానికి పెరిగిన గిరాకీ.. కోలుకుంటోన్న రియల్ ఎస్టేట్

హైదరాబాద్‌లో ఆఫీసు స్థలం అద్దెకు తీసుకోవటం, ఇళ్ల కొనుగోళ్లు గత ఏడాది ద్వితీయార్ధంలో గణనీయంగా పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఒక తాజా నివేదికలో వెల్లడించింది.

ఆఫీసు స్థలానికి పెరిగిన గిరాకీ.. కోలుకుంటోన్న రియల్ ఎస్టేట్
ఆఫీసు స్థలానికి పెరిగిన గిరాకీ.. కోలుకుంటోన్న రియల్ ఎస్టేట్
author img

By

Published : Jan 7, 2021, 10:05 AM IST

హైదరాబాద్‌లో ఆఫీసు స్థలం అద్దెకు తీసుకోవటం, ఇళ్ల కొనుగోళ్లు గత ఏడాది ద్వితీయార్ధంలో గణనీయంగా పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఒక తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ స్థితిగతులపై నైట్‌ ఫ్రాంక్‌ అధ్యయనం చేసింది. ఈ నివేదికలో పేర్కొన్న ఇతర ముఖ్యాంశాలు..

ఆఫీసు స్థలం...

* గత ఏడాది ద్వితీయార్ధంలో హైదరాబాద్‌లో 38 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. అదే సమయంలో 49 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థల నిర్మాణం పూర్తయింది. గత ఏడాది జులై- సెప్టెంబరు మధ్యకాలంతో పోల్చితే, అక్టోబరు- డిసెంబరు మధ్యకాలంలో ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకోవటం 640% పెరిగింది.

* ‘కరోనా’ టీకా అందుబాటులోకి రావచ్చనే అంచనాలతో వివిధ వ్యాపార సంస్థలు తమ భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకోవటం ప్రారంభించాయి.

* ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌) విభాగానికి చెందిన కంపెనీల నుంచి ఆఫీసు స్థలానికి గిరాకీ కనిపించింది. 2019 ద్వితీయార్ధంతో పోల్చితే 2020 ద్వితీయార్ధంలో ఈ విభాగానికి చెందిన కంపెనీలు 30 శాతం అధికంగా ఆఫీసు స్థలాన్ని తీసుకున్నాయి. రెండు పెద్ద కంపెనీలే దాదాపు 10 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని అద్దెకు తీసుకోవటానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఇళ్ల అమ్మకాలు

* గత ఏడాది ద్వితీయార్ధంలో హైదరాబాద్‌లో 5,260 ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాది జులై- సెప్టెంబరు మధ్యకాలంతో పోల్చితే అక్టోబరు- డిసెంబరు మధ్యకాలంలో ఇళ్ల అమ్మకాల్లో 127% వృద్ధి కనిపించింది. పండగల సందర్భంగా కొనుగోలుదార్లకు రియల్టర్లు రాయితీలు- ప్రోత్సాహకాలు ఇవ్వటం, ‘ఇంటి నుంచి పని’ చేయటానికి అనువుగా రూపుదిద్దుకున్న ఇళ్ల వైపు కొనుగోలుదార్లు మొగ్గుచూపటం ఈ వృద్ధికి కారణం.

* రూ.50 లక్షల లోపు ఇళ్లకు గిరాకీ అధికంగా కనిపించింది. 2019 ద్వితీయార్ధంతో పోల్చితే 2020 ద్వితీయార్ధంలో ఇటువంటి ఇళ్ల అమ్మకాల్లో 24% వృద్ధి నమోదైంది.

హైదరాబాద్‌లో డిమాండ్‌ ప్రధానంగా మాదాపూర్‌, రాయదుర్గ్‌లో.. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో గత ఏడాది ద్వితీయార్ధంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కోలుకుంటున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఈ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది జులై- డిసెంబరు మధ్య కాలంలో 2.22 కోట్ల చదరపు అడుగుల నిర్మాణ స్థలానికి సంబంధించిన లావాదేవీలు నమోదైనట్లు పేర్కొంది.

గత ఏడాదిలో కరోనా మహమ్మారి వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైనప్పటికీ సంవత్సరాంతానికి బాగా కోలుకుంటున్నట్లు వివరించింది. గత ఏడాది ద్వితీయార్ధంలో ఈ ఎనిమిది నగరాల్లో 94,997 ఇళ్ల అమ్మకాలు నమోదైనట్లు తెలిపింది. రూ.50 లక్షల కంటే అధిక ధర ఉన్న ఇళ్ల అమ్మకాల వాటా ఇందులో 57% ఉన్నట్లు పేర్కొంది. ప్రధానంగా బెంగుళూరు, హైదరాబాద్‌, పుణె, చెన్నై నగరాల్లో మార్కెట్‌ మెరుగుపడినట్లు వివరించింది.

ఇవీ చూడండి:ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.