ETV Bharat / business

కేంద్రానికి ఆర్​బీఐ రూ.లక్ష కోట్లు- ఇంత భారీగా ఎందుకు?

గడిచిన రెండు దశాబ్దాల్లో ఆర్​బీఐ నుంచి కేంద్రానికి బదిలీ అవుతోన్న మిగులు సుమారు రూ.10 వేల కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రూ. లక్ష కోట్లకు చేరింది. ఇంత భారీ మొత్తాలను ఆర్​బీఐ ఎందుకు బదిలీ చేస్తోంది? దానిని ఎలా నిర్ణయిస్తారో తెలుసుకోండి.

rise in rbi transfers to centre
కేంద్రానికి ఆర్ బీఐ మిగులు
author img

By

Published : May 22, 2021, 6:11 PM IST

2020-21 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలానికి రూ.99,122 కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్​బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ శక్తి కాంత్ దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఆర్​బీఐ సెంట్రల్​ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆమోదం లభించింది. ప్రస్తుత దేశీయ, ప్రపంచవ్యాప్త ఆర్థిక స్థితిగతులను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. దీంతో కరోనా ఆంక్షలు, లాక్​డౌన్​తో భారీగా ఆదాయం కోల్పోయిన కేంద్రానికి ఆర్థిక దన్ను లభించినట్లవుతుంది.

బదిలీ సూత్రంలో మార్పులు..

ఆర్​బీఐ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం, 1934 ప్రకారం దాని మిగులును కేంద్రానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.

ఒక ఆర్థిక సంవత్సరానికి అకౌంట్లను సమీక్షించి.. ఆర్​బీఐ డివిడెండ్ (మిగులు)ను ప్రకటిస్తుంది. ఈ మిగులు రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఆర్​బీఐకి ఆ ఏడాదిలో వచ్చిన ఆదాయం. రెండు, అత్యవసర నిధికి తరలించాల్సిన మొత్తం.

RBI to transfer nearly Rs 1 lakh crore to Centre: Why is the dividend going up
ఆర్​బీఐ ప్రధాన కార్యాలయం, ముంబయి

మిగులను ఎలా నిర్ణయిస్తారు?

కేంద్రానికి అధిక మొత్తంలో మిగులును బదిలీ చేయాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ఎంత సొమ్మును అత్యవసర నిధికి బదిలీ చేస్తే ఉత్తమమో నిర్ణయించడానికి ఎప్పటికప్పుడు నిపుణుల కమిటీలను నియమిస్తోంది ఆర్​బీఐ.

గత రెండు దశాబ్దాలలో అలాంటి నాలుగు కమిటీలను ఆర్​బీఐ నియమించింది. అవి వి. సుబ్రహ్మణ్యం(1997), ఉషా థోరట్(2004), వైవీ మాలేగామ్(2014), బిమల్ జలన్ (2018) లాంటి నిపుణుల నేతృత్వంలో ఏర్పడ్డాయి.

12 శాతం అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని సుబ్రహ్మణ్యం కమిటీ సిఫార్సు చేయగా, దానిని ఏకంగా.. మొత్తం ఆస్తుల విలువలో 18 శాతం వద్ద కొనసాగించాలని థోరట్ ప్యానెల్ సూచించింది. అయితే థోరట్ సిఫార్సులను అంగీకరించని ఆర్​బీఐ.. సుబ్రహ్మణ్యం సిఫార్సులను అమలుచేసింది.

ఇక, లాభాల నుంచి తగిన సొమ్మును అత్యవసర నిధికి ఏటా బదిలీ చేయాలని సూచించిన మాలేగామ్ ప్యానెల్.. నిర్దిష్ట సంఖ్యను పేర్కొనలేదు. తాజాగా ఏర్పడిన జలన్ కమిటీ.. ఇంకా తక్కువగా 5.5-6.5 శాతం మధ్యలో అత్యవసర నిధిని నిర్వహించాలని సూచించింది. దీంతో కేంద్రానికి భారీగా మిగులు బదిలీ చేయడానికి వీలుపడింది.

రూ.10 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు..

వివిధ కమిటీల సిఫార్సుల ఆధారంగా కేంద్రానికి మిగులును బదిలీ చేస్తూ వస్తోంది ఆర్​బీఐ. ఈ క్రమంలోనే ఆ డివిడెండ్.. 2001-02లో మోస్తరు రూ.10 వేల కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రూ.లక్ష కోట్లకు చేరింది.

కేంద్రానికి ఆర్​బీఐ మిగులు బదిలీ

ఉదాహరణకు 2013-14లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 60శాతం అధిక డివిడెండ్ బదిలీకి ఆర్​బీఐ ఆమోదించింది. అలాగే, 2018-19లో ఏకంగా రూ.1,75,987 కోట్లను బదిలీ చేసింది. ఒక ఏడాది కాలంలో ప్రభుత్వానికి ఆర్​బీఐ బదిలీ చేసిన మిగులులో ఇదే అత్యధికం. ఇక తాజాగా చేసిన రూ.99,122 కోట్ల బదిలీ రెండో అత్యధికం.

ఆర్​బీఐకి ఆదాయం ఎలా వస్తుంది?

ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లు, ఫారెన్ ఎక్స్చేంజీ లాభాలు, రిస్క్ ప్రొవిషన్లను రైట్ ఆఫ్ చేయడం ద్వారా ఆర్​బీఐ ఆర్జిస్తుంది. పైగా ఆర్​బీఐ చట్టం ప్రకారం బ్యాంకు ఆదాయం, లాభాలపై ఎలాంటి పన్నులు ఉండవు.

కేంద్రానికి ఆర్​బీఐ డివిడెండ్ ఎందుకివ్వాలి?

ఆర్​బీఐను.. 1935, ఏప్రిల్ 1న బ్రిటీష్​ పాలనలో స్థాపించారు. భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం 1934ను అనుసరించి దీనిని ఏర్పాటు చేశారు. తొలుత ఇది పూర్తిగా ప్రైవేటు బ్యాంక్​గా సేవలందించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1949లో ఆర్​బీఐని భారత ప్రభుత్వం జాతీయం చేసింది. అప్పటి నుంచి ఆర్​బీఐపై పూర్తి హక్కులు ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. అయితే ఆర్​బీఐ చట్టం 1935 ప్రకారం కేంద్ర బ్యాంకు వద్దనున్న మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేయడం తప్పనిసరి అనే నిబంధన కొనసాగుతూ వస్తోంది.

ఇదీ చూడండి: '2020లో 81% భారతీయ కంపెనీల డేటా చోరీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.