reliance capital news: రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డ్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) (rbi news)సస్పెండ్ చేసింది. దీనికి ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. వివిధ లావాదేవీలను చెల్లించడంలో విఫలమైనందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
"కంపెనీకు రుణాలు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించడంలో ఆర్సీఎల్ బోర్డ్ విఫలమైంది. ఇందుకు సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించలేదు. పాలనాపరమైన అనిశ్చితుల నేపథ్యంలో బోర్డును సస్పెండ్ చేస్తున్నాం."
- ఆర్బీఐ
గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన వై నాగేశ్వరరావును వారి స్థానంలో అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. రిజర్వ్ బ్యాంక్ త్వరలో ఆర్సీఎల్ లావాదేవీలకు సంబంధించిన చర్యలను చేపడుతుందని తెలిపింది. అంతేగాకుండా ఈ కంపెనీకు సంబంధించి దివాలా ప్రక్రియను నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యులనల్‌కు ఆర్బీఐ దరఖాస్తు చేసింది.
ఇదీ చూడండి: 'బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది లేదు'