సార్వభౌమ పసిడి బాండ్ల రెండో విడత ఇష్యూ ఈ నెల 24న ప్రారంభం కానుంది. 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక గ్రాము ధరను రూ.4,842గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిర్ణయించింది.
ప్రభుత్వం తరఫున బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంటుంది. ఆన్లైన్, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసే మదుపర్లకు గ్రాముకు రూ.50 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. వారికి ఒక్కో గ్రాము రూ.4,792కు లభిస్తుంది.
ఇదీ చూడండి: ఎయిర్ ఇండియాలో భారీ స్థాయిలో డేటా లీక్!
ఇదీ చూడండి: యాంటీబాడీల నిర్ధరణకు డీఆర్డీఓ 'కిట్'