ETV Bharat / business

పీఎంసీ బ్యాంకుపై మరో 3 నెలల పాటు ఆంక్షలు

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్​పై విధించిన ఆంక్షలను మరో మూడు నెలలు కొనసాగిస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. జూన్ 22 వరకూ ఆంక్షలు వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. వీటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొంది.

rbi pmc bank
పీఎంసీ
author img

By

Published : Mar 21, 2020, 7:01 PM IST

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్​(పీఎంసీ)పై విధించిన ఆంక్షలను జూన్ 22 వరకు పెంచుతూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.

రియల్​ ఎస్టేట్ డెవలపర్​ సంస్థ హెచ్​డీఐఎల్​కు ఇచ్చిన రుణాల్లో అవకతవకలు, ఆర్థిక అక్రమాల కారణంగా పీఎంసీ బ్యాంక్​పై 2019 సెప్టెంబర్​ 23న ఆరు నెలల పాటు ఆంక్షలు విధించింది ఆర్​బీఐ. తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ ఆంక్షలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

వాణిజ్య బ్యాంకుల మాదిరిగా కాకుండా కోఆపరేటివ్ బ్యాంకుల పునర్నిర్మాణానికి పథకాలు రూపొందించే అధికారం ఆర్​బీఐకి లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు పునరుద్ధరణ కోసం అధికారులు, షేర్​ హోల్డర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రిజర్వు బ్యాంకు​ వెల్లడించింది.

ఆంక్షల కారణంగా కొత్త డిపాజిట్లు, రుణాలు జారీ చేయకుండా పీఎంసీ బ్యాంకుపై నిషేధం కొనసాగనుంది. ఇప్పటికే బ్యాంకు బోర్డును ఆర్​బీఐ రద్దు చేసింది. బ్యాంకు కార్యకలాపాలు పర్యవేక్షించడానికి మాజీ ఆర్​బీఐ అధికారిని నియమించింది.

ఇదీ చదవండి: 'కరోనా ప్రభావం ముదిరితే.. కార్యకలాపాలన్నీ బంద్​ చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.