ETV Bharat / business

బ్యాంకులకు రుణ పరిమితిని పొడిగించిన ఆర్​బీఐ

author img

By

Published : Sep 29, 2020, 12:03 PM IST

ద్రవ్య కొరతను తీర్చేందుకు బ్యాంకులకు రణాలు అందించే సదుపాయాన్ని 2021 మార్చి 31 వరకు పొడిగించింది ఆర్​బీఐ. రుణ పరిమితిని కూడా పెంచింది.

rbi
ఆర్​బీఐ

బ్యాంకులకు మెరుగైన రుణాలు అందించే సదుపాయాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆరు నెలలు పొడిగించింది. 2021 మార్చి 31 వరకు ద్రవ్య కొరతను తీర్చడానికి ఆర్​బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది మార్చి 27న జరిగిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) పథకం కింద షెడ్యూల్ చేసిన బ్యాంకుల రుణ పరిమితిని 2 నుంచి 3 శాతానికి పెంచింది. దీనికి తొలుత జూన్​ 30 వరకు గడువు విధించింది. అనంతరం సెప్టెంబర్​ 30 వరకు పొడిగించింది. ప్రస్తుతం మరోసారి పెంచింది ఆర్​బీఐ.

దీనివల్ల రూ.1.49 లక్షల కోట్ల మేర అదనపు నిధులు పెరిగే అవకాశం ఏర్పడుతుందని ఆర్​బీఐ తెలిపింది. ఎంఎస్‌ఎఫ్ కింద చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి తగ్గించటం ద్వారా బ్యాంకులు తమకు అవసరమైన రుణం తీసుకోవచ్చు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు ప్రస్తుతం 4.25 శాతంగా ఉంది.

ఇదీ చూడండి: సహకారానికి రిజర్వ్‌ బ్యాంకే జవాబుదారీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.