ETV Bharat / business

'భారతరత్న' ప్రచారం ఆపండి- నెటిజన్లకు టాటా విజ్ఞప్తి - #BharatRatnaForRatanTata

తనకు భారతరత్న ఇవ్వాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న నెటిజన్లకు ఓ విజ్ఞప్తి చేశారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్​ ఛైర్మన్​ రతన్​ టాటా. అలాంటి ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. అవార్డుల కంటే దేశానికి సేవ చేయడమే తాను అదృష్టంగా భావిస్తానని అన్నారు.

Ratan-Tata-Request-to-stop-campaign-on-Bharat-Ratna
'భారతరత్న' ప్రచారం ఆపండి- నెటిజన్లకు టాటా విజ్ఞప్తి
author img

By

Published : Feb 6, 2021, 12:19 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై స్పందించిన టాటా.. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డుల కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడమే తాను అదృష్టంగా భావిస్తానని అన్నారు. అసలేం జరిగిందంటే..

డాక్టర్‌ వివేక్‌ భింద్రా అనే ఓ మోటివేషనల్‌ స్పీకర్‌ శుక్రవారం తన ట్విట్టర్‌ ఖాతాలో రతన్‌ టాటా గురించి ఓ ట్వీట్‌ చేశారు. పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని.. అందుకోసం తమ #BharatRatnaForRatanTata ప్రచారంలో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. రతన్‌టాటా భారత రత్నకు అర్హులంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు.

అదే నాకు గర్వకారణం..

తాజాగా ఈ ప్రచారంపై రతన్‌ టాటా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ''నాకు అవార్డు ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో కొందరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను నేను అభినందిస్తున్నా. అయితే ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని వారిని సవినయంగా కోరుతున్నా. వీటన్నంటికంటే నేను భారతీయుడిని అవడం.. దేశ వృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను.'' అని టాటా తెలిపారు.

పారిశ్రామికవేత్త, దాతగా కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న రతన్‌ టాటా.. దేశంలో కరోనా విజృంభించిన సమయంలో రూ. 1500కోట్ల విరాళాలు ప్రకటించి తన పెద్దమనసు చాటుకున్నారు. ఆయన సేవలకుగానూ కేంద్రం 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌, 2008లో పద్మవిభూషణ్‌ పురస్కరాలతో సత్కరించింది.

ఇదీ చూడండి: రతన్​ టాటా అందుకే అంత ప్రత్యేకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.