ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు ఇండో -ఇజ్రాయెల్ ఛాంబర్ అఫ్ కామర్స్ సమాఖ్య (ఎఫ్ఐఐసీసీ) ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేసింది. శాంతి, సుస్థిరాభివృద్ధిని నెలకొల్పే ఆవిష్కరణలను ప్రోత్సహించినందుకుగాను 'గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ ఆండ్ పీస్' అవార్డుతో సత్కరించింది. దుబాయ్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి టాటా వర్చ్యవల్గా హాజరయ్యారు.
"ఇజ్రాయెల్‌కు రతన్ టాటా అందించిన సాయం మర్చిపోలేనిది. భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించారు. భారత్, ఇజ్రాయెల్, యూఏఈలో ఆయనను ఎంతగానో ఆదరిస్తారు. అబ్రహమ్ అకార్డ్ తన జీవితకాలంలో సాధ్యమైనందుకు ఆయన ఎంతో సంతోషిస్తారు. భారత్‌లో ఆయన నిజాయితీగల వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు."
- డాక్టర్ గుల్ క్రిపాలనీ, ఇండో-ఇజ్రాయెల్ ఛాంబర్ అధ్యక్షుడు
ఇజ్రాయెల్ భారత్‌కు అవకాశాల గని
ఇజ్రాయెల్ వంటి దేశంతో భాగమవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రతన్ టాటా అన్నారు. భారత్‌కు ఈ దేశం అవకాశాల గని అని తాను చాలా సందర్భాల్లో పేర్కొన్నానన్నారు.
"భారత్, ఇజ్రాయెల్, మధ్య ఆసియా దేశాలు కలవడం మంచి భవిష్యత్తుకు పునాది. ఈ దేశాల మధ్య ఇలా సమాఖ్యలు ఉండటం లాభదాయకమేనని భావిస్తాను. నిజానికి ఇది కొన్ని ఏళ్ల ముందే జరగాల్సింది."
-రతన్ టాటా, గ్లోబల్ విజినరీ పురస్కార గ్రహిత.
ఇదీ సంగతి : ధరల పెంపు బాటలో వాహన తయారీ సంస్థలు