ETV Bharat / business

'వైద్యశాస్త్రంపై రాం​దేవ్​కు దురుద్దేశమేమీ లేదు' - రామ్​దేవ్​ బాాబా కామెంట్స్​పై పతంజలి యోగాపీఠ్​ ట్రస్ట్ న్యూస్

ఆధునిక వైద్య శాస్త్రంపై యోగా గురువు రాందేవ్​ బాబాకు వ్యతిరేక ఉద్దేశమేమీ లేదని పతంజలి యోగ్‌పీఠ్ ప్రకటించింది. ఈ మేరకు అల్లోపతికి వ్యతిరేక ప్రకటనలు చేస్తూ.. రాందేవ్ ప్రజలను తప్పుదోవ పట్టించారనే భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) ఆరోపణలను ఖండించింది.

Ramdev
యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా
author img

By

Published : May 22, 2021, 10:02 PM IST

''ఆధునిక వైద్య శాస్త్రం, ఔషధాలపై బాబాకు దురుద్దేశమేమీ లేదు. ఆయనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో భాగంగానే నకిలీ వీడియోలు ప్రచారం అవుతున్నాయి.''

-పతంజలి యోగ్​పీఠ్​ ట్రస్ట్

కరోనా మహమ్మారి విసిరిన సవాళ్ల మధ్య రాత్రి-పగలు తేడా లేకుండా సేవలందిస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది పట్ల రాందేవ్ కృతజ్ఞత కలిగి ఉన్నారని, అభినందనలు తెలుపుతున్నారని పతంజలి యోగ్​పీఠ్​ ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.

"అల్లోపతి ఏక్ స్టుపిడ్ ఔర్ దివాని సైన్స్ హై" (అల్లోపతి ఒక స్టుపిడ్ సైన్స్) అని రాందేవ్ బాబా అంటున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోను ఉటంకించిన ఐఎంఏ.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేసింది.

అయితే.. అది రాం​దేవ్​కు వాట్సాప్​లో వచ్చిన ఒక ఫార్వార్డ్ సందేశమని.. దానిని ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారికి చదివి వినిపిస్తుండగా తీసిన వీడియో మాత్రమేనని పతంజలి స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: 'బాబా రాందేవ్‌పై కేసు నమోదు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.