ETV Bharat / business

బజాజ్​ ఫైనాన్స్​ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న రాహుల్ - బజాజ్ ఫైనాన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాహుల్ బజాజ్​

బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ పదవి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ తప్పుకోనున్నారు. ఆయన తరువాత ప్రస్తుత వైస్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్... ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు.

Rahul Bajaj to step down as Bajaj Finance Chairman; paves way for son Sanjiv
బజాజ్​ ఫైనాన్స్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న రాహుల్ బజాజ్​
author img

By

Published : Jul 21, 2020, 3:46 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్​ జులై 31న బజాజ్ ఫైనాన్స్ నాన్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నారు. అయితే ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్​ ఇండిపెండెంట్​ డైరెక్టర్​గా కొనసాగనున్నారు.

వారసుడొస్తున్నాడు..

రాహుల్ బజాజ్​ తరువాత ప్రస్తుత వైస్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్​... బజాజ్ ఫైనాన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా బాధ్యతలు తీసుకుంటారని సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది. 2020 ఆగస్టు 1న ఆయన బాధ్యతలు తీసుకుంటారని స్పష్టం చేసింది.

ఐదు దశాబ్దాలుగా...

1987లో బజాజ్​ ఫైనాన్స్ ప్రారంభమైనప్పటి నుంచి రాహుల్ బజాజ్ అందులో కీలక భాగస్వామిగా ఉన్నారు. అలాగే మూడు దశాబ్దాల పాటు సంస్థకు... నాన్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​గా సేవలందించారు.

ఇదీ చూడండి: అమెజాన్ బాస్ సంపద ఒక్క రోజులో రూ.97 వేల కోట్లు ప్లస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.