Raghuram Rajan On Indian Economy: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆశాజనకంగా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కానీ దీనికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని తెలిపారు. వీటిపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక లోటును అరికట్టేందుకు ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో కే షేప్ రికవరీ నుంచి బయటపడాలంటే కచ్చితంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాధారణంగా ఈ కే షేప్ రికవరీలో ఆర్థిక మందగమనం వివిధ రంగాలపై అసమానంగా ఉంటుంది. వైరస్ కారణంగా సాంకేతికత, బడా సంస్థలు మరింత వృద్ధిని కనబరిస్తే.. అదే సమయంలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు నేలచూపులు చూశాయి.
"కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇది తిరిగి పుంజుకునే సమయంలో వస్తు వినియోగం ఎక్కువ అవుతుంది. దాని ప్రభావం సూక్ష్మ, మధ్యతరగతి రంగాలతో పాటు తర్వాత తరంపై కూడా పడుతుంది. ఈ విషయమే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కొంత ఆశాజనకంగా ఉన్నా సరే.. ఈ ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది. ఆరోగ్యం, ఐటీ, ఐటీ సంబంధిత రంగాలు భారీగా పుంజుకున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కొంత మేర బలంగా ఉంది. మరోవైపు నిరుద్యోగం పెరగడంతో పాటు కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి సంస్థలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొక తప్పదు."
-రఘురామ్ రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్
వైద్య, ఆర్థిక కార్యకలాపాలకు ఒమిక్రాన్‌తో ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యిందని రాజన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థలో కే షేప్ రికవరీని తగ్గించేందుకు సత్వరం వీలైనన్ని చర్యలను చేపట్టాలని కేంద్రానికి సూచించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి:
Dolo 650 Tablet: అందరి నోళ్లలో 'డోలో 650'.. ఎందుకింత ప్రాధాన్యం?