కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లకు కీలకం కానున్నాయి. జులై డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ఈ వారమే ముగియనున్న నేపథ్యంలో సూచీలు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనితోపాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై మదుపరులు దృష్టిసారించొచ్చని చెబుతున్నారు.
ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించే కంపెనీలు..
యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్&టీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, కోల్గేట్, టెక్ మహీంద్రా, బీహెచ్ఈఎల్, ఐఓసీ, సన్‌ఫార్మా, ఇండిగో వంటి కంపెనీలు ఈ వారం ఫలితాలు ప్రకటించే జాబితాలో ప్రధానంగా ఉన్నాయి.
వీటన్నింటితో పాటు కరోనా కేసులు, వ్యాక్సినేషన్ అప్డేట్స్, ముడి చమురు, రూపాయి మారకం విలువ వంటి అంశాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చదవండి:'2047 కల్లా అమెరికా సరసన భారత్'