ETV Bharat / business

ఉద్యోగుల వేటలో పబ్​జీ.. ఇక రీఎంట్రీకి ఫిక్స్​! - పబ్​జీ

లింక్డ్​ఇన్​లో పబ్​జీకి సంబంధించిన ఉద్యోగాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో త్వరలోనే శుభవార్త అందుతుందని పబ్​జీ లవర్స్​ భావిస్తున్నారు.

PUBG India job listings found in LinkedIn, indicates imminent launch
పబ్​జీ రీఎంట్రీకి రంగం సిద్ధం!
author img

By

Published : Apr 13, 2021, 7:20 AM IST

పబ్​జీ.. ఈ ఆన్​లైన్​ గేమ్​ను దేశంలోని అనేకమంది ఇప్పటికీ మిస్​ అవుతున్నారు. భారత ప్రభుత్వం నిషేధించిన ఈ మొబైల్​ గేమ్​ ఇవాళో.. రేపో మళ్లీ తిరిగొస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పబ్​జీ లవర్స్​ కలలు నెరవేరే రోజులు దగ్గర పడుతున్నట్టు కనిపిస్తోంది.

తాజాగా.. పబ్​జీ కార్పొరేషన్​కు సంబంధించిన ఉద్యోగాలు లింక్డ్​ఇన్​లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో త్వరలో పబ్​జీ రీ ఎంట్రీ ఇస్తుందన్న సంకేతాలు మరింత బలపడ్డాయి. సీనియర్​ మార్కెటింగ్​ మేనేజర్​-ఇండియా, ప్రొడక్ట్​ మేనేజర్​-ఇండియా, వీడియో ఎడిటర్​-ఇండియా, ప్రొడక్ట్​ ఎనలిస్ట్​-ఇండియా వంటి ఉద్యోగాలను లింక్డ్​ఇన్​లో పెట్టారు. గత నాలుగు రోజుల్లోనే ఇన్ని అప్లికేషన్లు పెట్టడం విశేషం. ఇవన్నీ బెంగళూరు ఆధారంగానే ఉన్నాయి. పబ్​జీ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉండే అవకాశముందని దీని ద్వారా తెలుస్తోంది.

వీటన్నింటినీ చూస్తే.. పబ్​జీ రూపకర్త క్రాఫ్టాన్​.. గేర్​ మార్చి పనులు వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది. టీమ్​ రెడీ అవుతోందని.. కొత్త వర్షెన్​కు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

నిషేధం ఇందుకే..

చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన అనేక యాప్స్​పై భారత ప్రభుత్వం గతేడాది నిషేధం విధించింది. వాటిల్లో పబ్​జీ ఒకటి. అయితే పబ్​జీ ప్రత్యక్షంగా చైనా యాప్​ కాదు. చైనా ఆధారిత టెన్​సెంట్​ సంస్థకు పబ్​జీతో సంబంధం ఉండటం వల్ల యాప్​ నిషేధానికి గురైంది. అనంతరం ఆ సంస్థ పబ్​జీ కార్పొరేషన్​ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి.. పబ్​జీని తిరిగి దేశంలో విడుదల చేసేందుకు మాతృసంస్థ క్రాఫ్టాన్​ ప్రయత్నిస్తూనే ఉంది.

ఇదీ చూడండి:- పబ్​జీ బ్యాన్: టెన్​సెంట్​ ఖేల్​ ఖతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.