ETV Bharat / business

బ్యాంకు ఉద్యోగులకు రూ.20లక్షల బీమా! - psu banks insurance

కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న తమ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ బీమా కవరేజీని అందిస్తున్నట్లు ఆర్థిక శాఖ ట్విట్టర్​లో వెల్లడించింది. ఉద్యోగుల సంరక్షణకు బ్యాంకులు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

PSU banks to provide up to 20lakh insurance coverage
బ్యాంకు ఉద్యోగులకు రూ.20లక్షల బీమా!
author img

By

Published : Apr 21, 2020, 7:11 AM IST

కరోనా నేపథ్యంలోనూ సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లు బీమా కవరేజీని అందిస్తున్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఉద్యోగుల సంరక్షణకు బ్యాంకులు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. సిబ్బంది కోసం ప్రత్యేకంగా వైద్యులను నియమించడమే కాకుండా.. ఒక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దురదృష్టవశాత్తు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు కరోనా కారణంగా మరణిస్తే భారీ స్థాయిలో బీమా పరిహారాన్ని అందజేయనున్నట్లు ఒక ట్వీట్‌లో ఆర్థిక శాఖ తెలిపింది. ఏ బ్యాంకుకాబ్యాంకు తమ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ బీమా కవరేజీని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఇది రూ.20 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.