ETV Bharat / business

ఈనెల 16,17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆ సేవలు బంద్​! - యూఎఫ్​బీయూ ఫుల్ ఫామ్

Bank Strike News: బ్యాంకుల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. డిసెంబర్​ 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) తెలిపింది. సమ్మె ప్రభావంతో పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని వినియోగదారులను హెచ్చరించాయి బ్యాంకులు.

BANK
బ్యాంకు
author img

By

Published : Dec 15, 2021, 8:25 PM IST

Bank Strike News: బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) ప్రకటించింది. తొమ్మిది యూనియన్లతో కూడిన ఈ ఫోరం ఈనెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు స్ట్రైక్​ చేయాలని నిర్ణయించింది. అదనపు చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమైనంద వల్లే సమ్మెకు వెళ్తున్నామని ప్రకటించింది. సమ్మె కారణంగా చెక్​ క్లియరెన్స్ సహా.. నగదు బదిలీ వంటి బ్యాంకింగ్ కార్యకలాపాలపై సమ్మె ప్రభావం ఉంటుందని కస్టమర్లను హెచ్చరించాయి బ్యాంకులు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్​బీ)ను ప్రైవేటీకిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా తాము ఈ సమ్మె చేపడుతున్నట్లు పేర్కొంది యూఎఫ్​బీయూ.

ఇదీ నేపథ్యం..

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 2019లో ఐడీబీఐ బ్యాంక్​లోని మెజార్టీ వాటాను ఎల్​ఐసీకి విక్రయించింది. ఇలా నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదింపచేయడానికి కేంద్ర ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని యూఎఫ్‌బీయూ నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్​ వెంకటాచలం తెలిపారు.

ఇవీచదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.