ETV Bharat / business

జీఎస్టీ అటుఇటైతే ఎస్​ఎమ్ఎస్​ వస్తుంది! - e-way bill

జీఎస్టీ చెల్లింపుదారులకు ఎస్​ఎమ్​ఎస్​ సౌకర్యం కల్పిస్తున్నారు. పన్ను చెల్లింపులు, రిటర్నుల దాఖలు, ఐటీసీ క్లెయిమ్​ల్లో తేడాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్​గా ఎస్​ఎమ్​ఎస్​లను పంపే వ్యవస్థను జీఎస్టీ నెట్​ వర్క్ సమకూర్చుకుంది.

జీఎస్టీ అటుఇటైతే ఎస్​ఎమ్ఎస్​ వచ్చేస్తోంది!
author img

By

Published : Jun 30, 2019, 1:22 PM IST

Updated : Jun 30, 2019, 2:22 PM IST

వస్తు, సేవల పన్ను చెల్లిస్తున్న యజమానులు, ప్రమోటర్లు, డైరెక్టర్లకు ఇకపై స్వయంచాలితంగా ఎస్​ఎమ్​ఎస్​లను​ పంపే వ్యవస్థను జీఎస్టీ నెట్​వర్క్​ అభివృద్ధి చేసింది. పన్ను చెల్లింపులు, రిటర్నులు దాఖలు చేయడం, వ్యాపార సంస్థల ఐటీసీ క్లెయిమ్​ల్లో తేడాలు ఉన్నట్లయితే... ఆ విషయాన్ని ఎస్​ఎమ్​ఎస్​ల ద్వారా తెలియజేస్తామని జీఎస్టీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రకాశ్​కుమార్​ తెలిపారు.

జీఎస్టీ వ్యవస్థ 'రెడ్​ ఫ్లాగ్​' హెచ్చరిక జారీ చేసిన తరువాత, పన్ను చెల్లింపుదారుడిని అప్రమత్తం చేసి, తగిన చర్యలు తీసుకునే విధంగా చేస్తామని ప్రకాశ్​ కుమార్ అన్నారు. అందులో భాగంగా ఈ సమాచారాన్ని రెవెన్యూ శాఖతోనూ పంచుకుంటామని తెలిపారు.

"జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్​-1... జీఎస్టీఆర్​-3బీ, ఈ-వే బిల్లుల మధ్య వ్యత్యాసం ఉన్నచోట అధీకృత వ్యక్తులకు రిమైండ్​ ఎస్​ఎమ్​ఎస్​లు వెళ్తాయి. వీరితో పాటు ప్రమోటర్లకు, బోర్డు డైరెక్టర్లకూ ఈ ఎస్​ఎమ్​ఎస్​లు వెళ్తాయి. రిటర్నులు దాఖలు చేసిన మూడు రోజుల తరువాత జీఎస్టీ వ్యవస్థ స్వయంచాలితంగా ఈ ఎస్​ఎమ్​ఎస్​లు పంపుతుంది." -ప్రకాశ్ కుమార్​, జీఎస్టీ నెట్​వర్క్​ ముఖ్యకార్యనిర్వహణాధికారి

"ఐటీ రిటర్నుల దాఖలు, ఇన్​పుట్​ టాక్స్ క్రెడిట్​ (ఐటీసీ) చెల్లింపుల్లో అసమతుల్యతలు వంటి సమాచారమంతా పన్ను చెల్లింపుదారులకు వారి డాష్​బోర్డ్​లోనే చూపిస్తున్నాము. ఎందుకంటే డాష్​బోర్డ్​ను అకౌంట్స్ చూసే వ్యక్తి లేదా సీఎఫ్​ఓ మాత్రమే చూస్తుండవచ్చు. అందువల్ల ఆ విషయాలు ప్రమోటర్లకు తెలియకపోవచ్చు. అందుకే ప్రమోటర్లకూ ఎస్​ఎమ్​ఎస్​లు పంపిస్తున్నాము." -ప్రకాశ్ కుమార్​, జీఎస్టీ నెట్​వర్క్​ ముఖ్యకార్యనిర్వహణాధికారి

ఈ చర్యలతో ప్రమోటర్లు, డైరెక్టర్లు, యజమానులు సకాలంలో పన్నులు చెల్లించడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి సహాయపడుతుందని ప్రకాశ్ అన్నారు.
22 ఆగష్టు, 2019 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. వరుసగా రెండు నెలలపాటు జీఎస్టీఆర్​-3బీ దాఖలు చేయని వ్యాపారులకు మాత్రం ఈ ఎస్​ఎమ్ఎస్​ సౌకర్యం అందించబోమని ప్రకాశ్ తెలిపారు.

పన్ను ఎగవేతలు నిరోధించే చర్యల్లో భాగంగా రవాణాదారులు, వ్యాపారస్తులు.. రూ.50 వేలకు మించిన వస్తువులను రవాణాకు చేయడానికి ఈ-వే బిల్లులు రూపొందించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం జీఎస్టీ కింద 1.22 కోట్ల మంది తమ వ్యాపారాలను నమోదు చేసుకున్నారు. వారిలో 17.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుగా ఉన్నారు.

ఇదీ చూడండి: చారిత్రకం: ఉత్తర కొరియాలో కాలుమోపిన ట్రంప్​

Intro:Body:

gg

Conclusion:
Last Updated : Jun 30, 2019, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.