ETV Bharat / business

కరోనా అనిశ్చితిలో అప్రమత్తంగా మార్కెట్లు! - కరోనా కాలంలో స్టాక్ మార్కెట్​ మదుపరులు పాటించాల్సిన జాగ్రత్తలు

ప్రపంచమే కాదు.. స్టాక్‌ మార్కెట్లూ ఇపుడు కరోనా కారణంగా అనిశ్చితిలోకెళ్లాయి. మరిన్ని ఊగిసలాటలకూ ఆస్కారం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు ఏం చేయాలి? ఊగిసలాటల నుంచి తమ పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలి? ఎటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలి?

COVID impact on Stocks
స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం
author img

By

Published : May 14, 2021, 11:00 AM IST

భారత స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా మలివిడత విజృంభిస్తోంది. దీంతో సమీప భవిష్యత్‌లో ఈక్విటీ మార్కెట్‌ సెంటిమెంటు కూడా బలహీనంగా మారనుంది. గతేడాది ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొన్న కార్పొరేట్లు, మదుపర్లు ఈ సవాళ్లకు ఈసారి సిద్ధంగా ఉన్నారనే చెప్పొచ్చు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలోనే త్వరలోనే కేసుల సంఖ్య కంటే టీకా డోసులు భారీ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది.

వృద్ధి బాగున్నా..

ఒక్కసారి కరోనా నియంత్రణలోకి వచ్చాక, రికవరీ సాధారణంగానే లయను అందుకుంటుంది. రాబోయే రోజుల్లో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తన సర్దుబాటు ధోరణిని కొనసాగిస్తుందన్న అంచనాల మధ్య ఆర్థిక రికవరీ బాగానే ఉంటుందని అనుకోవచ్చు. ఒక వేళ యూఎస్‌ ఫెడరల్‌ కఠిన వైఖరికి మారినా.. ఉద్దీపన చర్యలను వెనక్కి తీసుకున్నా అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల పాలయ్యే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఆ ప్రభావం మన మార్కెట్లపైనా పడి దిద్దుబాటుకు గురికావొచ్చు. కాబట్టి మొత్తం మీద చూస్తే ఇప్పటి నుంచి ఊగిసలాటలు మరింత పెరుగుతాయన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మదుపర్లు డైనమిక్‌ అసెట్‌ అలొకేషన్‌ విధానాన్ని పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించడమే మేలు.

ద్రవ్యోల్బణం విషయానికొస్తే..కాస్తంత అది పెరిగినా పెద్దగా భయపడాల్సినంత ఉండకపోవచ్చు. చరిత్ర చూసినా ద్రవ్యోల్బణం ఓ మోస్తరుగా ఉన్న ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారాలు వేగంగానే నడిచాయి. స్థిరాస్తి విక్రయాల్లో ఇటీవలి ధోరణే ఇందుకు ఉదాహరణ. లావాదేవీలకు ద్రవ్యోల్బణాన్ని ప్రతికూలంగా భావించడం లేదు.

అయిదేళ్ల కంటే తక్కువ కాలానికి..

రంగాల వారీ విషయానికొస్తే బ్యాంకులు, విద్యుత్‌, టెలికాం, సాఫ్ట్‌వేర్‌, లోహ రంగాలపై సానుకూలతలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కాలంగా ఐటీ రంగంపై సెంటిమెంటు పెరిగింది. అయితే ఇప్పటికే పెరిగిన షేర్ల ధరలు ఇంకా ఏ స్థాయికి వెళ్లగలవనేది ఇపుడు ప్రశ్న. కమొడిటీ కంపెనీలు కూడా రాణించే వీలుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపర్లు క్రమానుగత శ్రేణి పెట్టుబడుల ప్రణాళిక(సిప్‌) ద్వారా దీర్ఘకాలానికి(10ఏళ్లు) పెట్టు బడులు పెట్టవచ్చు. అయిదేళ్ల కంటే తక్కువ కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మాత్రం హైబ్రీడ్‌ తరహా పథకాలపై (అసెట్‌ అలొకేషన్‌ పథకాలు లేదా బాలెన్సెడ్‌ అడ్వాంటేజ్‌ క్యాటగిరీ పథకాలు) దృష్టి సారించడం మేలు. ఈ విభాగాల్లోని ఫండ్‌లు మార్కెట్ల ఊగిసలాటల నుంచి ప్రయోజనాలను పొందుతాయి. మార్కెట్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిల్లో ఫండ్‌ మేనేజర్లు నిధులను ఈక్విటీ, డెట్‌ల మధ్య సమయానికి అనుగుణంగా మార్చడానికి వీలుంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.