ETV Bharat / business

బడ్జెట్​పై నిర్మల కసరత్తు.. ఈసారి వర్చువల్​గానే!

Pre Budget Consultations: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బుధవారం బడ్జెట్ కసరత్తు మొదలు పెట్టనున్నారు. బడ్జెట్ తయారీకి ముందు వివిధ వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు.

nirmala sitaraman
నిర్మలా సీతారామన్
author img

By

Published : Dec 14, 2021, 5:47 PM IST

Pre Budget Consultations: 2022-23 సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనకు బుధవారం కసరత్తు మొదలుపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. వ్యవసాయ రంగ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి పరిశ్రమ నిపుణులతో ఆమె చర్చించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ట్విట్టర్​ ద్వారా తెలిపింది.

"2022-23 బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ తయారీకి ముందు వివిధ వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. డిసెంబరు 15న వర్చువల్​గా ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి."

-- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 దృష్ట్యా ఈ సమావేశాలన్నీ వర్చువల్​గానే ఉండనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టంచేసింది.

2022-23 బడ్జెట్​ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది కేంద్రం. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 9.5శాతంగా ఉంటుందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతా దాస్ అంచనా వేశారు.

ఇదీ చూడండి: జవాన్ల కోసం 'ఏసీ జాకెట్లు'.. 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ కూల్​గా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.