ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోకో ఎక్స్2 మొబైల్ భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. షావోమి నుంచి విడిపోయి ఇండిపెండెంట్ బ్రాండ్‌గా మారాక పోకో నుంచి వస్తున్న తొలి మొబైల్ కావడంతో ‘ఎక్స్2’ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.
డిజైన్ పరంగా ఈ ఫోన్‌ను రెడ్‌మీ కె30ను పోలి ఉన్నప్పటికీ.. కొన్ని ఆసక్తికర మార్పులు చేసినట్లుగా పోకో తెలిపింది. పోకో ఎక్స్2ను మూడు వేరియంట్లో అందుబాటులోకి తేనున్నారు. 6జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ మెమొరీ, 6జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది.
పోకో ఎక్స్2 ఫీచర్లు
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (1080x2340 పిక్సెల్) రియాల్టీ ఫ్లో 120హెడ్జ్ డిస్‌ప్లే
- ఎల్‌సీడీ ప్యానెల్ ఇంటెలిజెంట్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ టెక్నాలజీతో ఈ డిస్‌ప్లే
- ఆక్టాకోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్
- ఫోన్ హీట్ కాకుండా చూసే లిక్విడ్ కూల్ టెక్నాలజీ
- ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత ఎమ్‌ఐయూఐ 11
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
- 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
కెమెరాలు
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో నాలుగు, ముందు భాగంలో రెండు కెమెరాలను అమర్చారు. వెనకవైపున సోని ఐఎమ్‌ఎక్స్ 686 సెన్సార్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటాయి. దీనితో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా అందిస్తున్నారు.
ధర ఎంతంటే...
పోకో ఎక్స్2 6జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. 6జీబీ/128జీబీ వేరియంట్‌ను రూ.16,999కు అందిస్తున్నారు. 8జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ.19,999. అట్లాంటిస్ బ్లూ, మాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్ రంగుల్లో ఈ మొబైళ్లు లభ్యమవుతాయి. ఫిభ్రవరి 11న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఇదీ చూడండి: 'కార్పొరేట్లకు సహకరిస్తేనే వృద్ధి గాడిలో పడుతుంది!'