ETV Bharat / business

నేడు బ్యాంకుల అధినేతలతో మోదీ సమావేశం - NBFCs news

కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యల్లో భాగంగా నేడు బ్యాంకులు, బ్యాంకింగ్​యేతర ఆర్థిక సంస్థలు (ఎన్​బీఎఫ్​సీ) అధినేతలతో సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.

PM Modi
నేడు బ్యాంకుల అధినేతలతో మోదీ సమావేశం
author img

By

Published : Jul 29, 2020, 5:10 AM IST

కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కొద్ది రోజులుగా ఆర్థిక రంగంలోని వివిధ విభాగాలతో సమావేశమవుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో భాగంగానే ఇవాళ దేశంలోని పెద్ద బ్యాంకులు, బ్యాంకింగ్​యేతర ఆర్థిక సంస్థలు(ఎన్​బీఎఫ్​సీ) అధిపతులతో సమావేశం కానున్నారు. తీవ్రంగా ప్రభావతమైన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు మోదీ. ఈ మేరకు అధికారి ప్రకటన జారీ చేసింది కేంద్రం.

" ఈ సమావేశం అంజెండాలో ప్రధానంగా.. రుణాల మంజూరుకు సమర్థవంతమైన వ్యవస్థ, సాంకేతికత ద్వారా ఆర్థిక సాధికారత, ఆర్థిక రంగలో స్థిరత్వం వంటి అంశాలు ఉన్నాయి. మౌలిక, వ్యవసాయ, ఎంఎస్​ఎంఈలకు ఆర్థికంగా చేయూతనిస్తూ.. దేశ ఆర్థిక వృద్ధిలో బ్యాంకింగ్​ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ భేటీకి ప్రభుత్వ సీనియర్​ అధికారులు కూడా హాజరుకానున్నారు."

- ప్రకటన

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మే నెలలో ప్రకటించిన రూ. 20.97 లక్షల కోట్ల ప్యాకేజీలోని పలు అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాయి.

ఇదీ చూడండి: 'భారత్​లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.