ETV Bharat / business

భారత్ నుంచి మరిన్ని కరోనా టీకాలు: మోదీ - కరోనా టీకాపై మోదీ కీలక ప్రకటనలు

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో వర్చువల్​గా పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా సంక్షోభం నుంచి అంచనాలను మించి భారత్​ కోలుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి భారత్​ నుంచి రెండు కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయని.. త్వరలో మరిన్ని వస్తాయని మోదీ వెల్లడించారు.

Modi speech at Davos WEF Summit
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మోదీ ప్రసంగం
author img

By

Published : Jan 28, 2021, 6:27 PM IST

Updated : Jan 28, 2021, 7:51 PM IST

ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టి.. కేవలం 12 రోజుల్లోనే 23 లక్షల మందికి వ్యాక్సిన్​ వేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్​) సదస్సులో వర్చువల్​గా పాల్గొన్న మోదీ ఈ వివరాలు తెలిపారు.

భారత్​ ప్రస్తుతం రెండు టీకాలు తయారు చేసిందని.. త్వరలో మరిన్ని వ్యాక్సిన్​లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కరోనా కారణంగా భారత్ ప్రపంచస్థాయి బాధ్యతను తీసుకుని.. 150 దేశాలకు అవసరమైన ఔషధాలు సరఫరా చేసిందని గుర్తు చేశారు.

'కరోనా వల్ల భారత్​ అత్యధికంగా ప్రభావితమవుతుందని ప్రపంచమంతా భావించింది. 70-80 కోట్ల మందికి కరోనా సోకుతుందని, కనీసం 20 లక్షల మంది చనిపోతారని అంచనాలు వచ్చాయి. కానీ భారత్ నిరాశ చెందకుండా.. ఆ పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడు భారత్ అత్యంత సమర్ధంగా కరోనాను ఎదుర్కొంటోంది.' అని మోదీ వివరించారు.

ఇదీ చూడండి:ఆర్థిక సర్వేలో ఏముంటుందో తెలుసా?

Last Updated : Jan 28, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.