ETV Bharat / business

ఎన్నడూ లేని విధంగా స్మార్ట్​ఫోన్​ మార్కెట్ల పతనం

స్మార్ట్​ఫోన్ల మార్కెట్​కు కరోనా భయాలు పట్టుకున్నాయి. వైరస్​ వేగంగా విస్తరిస్తున్న కారణంగా స్మార్ట్​ఫోన్ల విక్రయాలు భారీగా క్షిణిస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో విక్రయాలు 38 శాతం తగ్గినట్టు ఓ సర్వేలో తేలింది. మార్చిలోనూ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చని సర్వే అభిప్రాయపడింది.

Corona effect on smartphone market
స్మార్ట్​ఫోన్లపై కరోనా ప్రభావం
author img

By

Published : Mar 21, 2020, 2:05 PM IST

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొవిడ్​-19 నేపథ్యంలో సప్లయి, డిమాండ్ వ్యవస్థ దెబ్బతింది. కరోనా కారణంగా ఫిబ్రవరిలో 61.8 మిలియన్ల స్మార్ట్​ఫోన్లు మాత్రమే విక్రయమైనట్లు స్ట్రాటజీ అనలైటిక్స్ సర్వేలో తేలింది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే.. ఈసారి విక్రయించిన స్మార్ట్​ఫోన్ల సంఖ్య 38 శాతం తక్కువని తెలిపింది.

"ప్రపంచ స్మార్ట్​ఫోన్ మార్కెట్​ మునుపెన్నడూ చూడనంత పతనాన్ని 2020 ఫిబ్రవరిలో నమోదు చేసింది. దీనిని గుర్తుచేసుకోకూడదని స్మార్ట్​ఫోన్ పరిశ్రమ భావిస్తోంది. స్మార్ట్​ఫోన్​ సప్లయి, డిమాండ్​కు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది." -స్ట్రాటజీ అనలైటిక్స్

కరోనా భయాలతో ఆసియాలో చాలా మంది స్టోర్లకు వచ్చి స్మార్ట్​ఫోన్లను కొనుగోలు చేయడమే తగ్గించేశారు. ఈ కారణంగా సంస్థలు కూడా తయారీని తగ్గించేశాయని సర్వే పేర్కొంది. వైరస్ బారి నుంచి చైనా కోలుకున్నట్లు తెలుస్తున్నా.. మార్చిలోనూ కొనుగోళ్లు తక్కువగానే ఉండొచ్చని తెలిపింది.

రానున్న రోజుల్లో విక్రయాలు పెంచుకునేందుకు స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థలు డిస్కౌంట్లు, ఫ్లాష్​ సేల్స్​ వంటి వ్యూహాలతో ముందుకు వచ్చే అవకాశముందని సర్వే అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:కరోనా తెచ్చిన తంటా- ఉద్యోగులకు జీతాలు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.