ETV Bharat / business

గోల్డ్​పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. - బంగారంపై పెట్టుబడికి ఏది సురక్షితం

బంగారంపై పెట్టుబడి పెట్టాలంటే భౌతిక కొనుగోలు చేయొచ్చు. అంతే కాకుండా డిజిటల్ పద్ధతుల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ రెండింటిలో.. డిజిటల్​ పద్ధతే ఉత్తమమని నిపుణులు చెబుతుంటారెందుకు? ఇందుకు కారణాలు ఏంటి?

How to get best returns with Gold
గోల్డ్​తో మంచి రిటర్న్​లు పొందటం ఎలా
author img

By

Published : Aug 5, 2021, 1:08 PM IST

గత కొన్నాళ్లుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. పెట్టుబడి పెట్టిన వారికి మంచి రాబడినే అందించింది ఈ విలువైన లోహం. దీనికి సురక్షిత పెట్టుబడిగా పేరుండటం వల్ల.. ప్రజలు కూడా పసిడిపై ఆసక్తి చూపుతున్నారు.

అయితే.. చాలా మందికి బంగారంపై భౌతికంగా పెట్టుబడి పెట్టాలా? డిజిటల్​గా మదుపు చేయాలా? అనే విషయంలో సందిగ్ధ పడుతున్నారు. అయితే.. నగలు అవసరం అనుకుంటే మాత్రమే భౌతికంగా బంగారం కొనుగోలు చేయాలని.. పెట్టుబడి కోసమైతే డిజిటల్ పద్ధతే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

భౌతిక బంగారంపై పెట్టుబడితో సమస్యలు...

బంగారాన్ని భౌతికంగా కొనుగోలు చేస్తే.. పలు సమస్యలు ఉన్నాయి. బంగారాన్ని సురక్షితంగా దాచటం అనేది ప్రధాన సమస్య. బ్యాంకు లాకర్​లో పెట్టినట్లయితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నగలు, కాయిన్ల రూపంలో ఇంట్లో పెట్టుకున్నట్లయితే దొంగతనం భయాలు ఎక్కువ. స్వచ్ఛత తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా విక్రయించేటప్పుడు తరుగు సమస్య కూడా ఉంటుంది.

డిజిటల్ పద్ధతుల్లో పెట్టుబడుల ద్వారా ప్రయోజనాలు...

ఈ సమస్యలేవీ ఉండొద్దంటే.. డిజిటల్ పద్ధతుల ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ గోల్డ్​లో నాణ్యత విషయంలో సమస్యే ఉండదు. వెబ్​సైట్, యాప్​ల ద్వారా ఎంత బంగారం ఉందన్నది చూసుకోవచ్చు. భౌతికంగా ఎలాంటి బంగారం ఉండదు కాబట్టి నిల్వ, తరుగు సమస్యలకు తావుండదు.

డిజిటల్ పద్ధతుల ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టినట్లయితే ఉపసంహరణ కూడా చాలా సులభం. ఒక్క క్లిక్ ద్వారా విక్రయించి లాభాలను తీసుకోవచ్చు. అదే భౌతికం బంగారాన్ని విక్రయించాలంటే కొంత అసౌకర్యంగా ఉంటుంది. దాని స్వచ్ఛతకు సంబంధించిన తనిఖీలు, ధృవీకరణ పత్రాలు లాంటి వాటి అవసరం ఉంటుంది.

డెలివరీ తీసుకోవచ్చు..

డిజిటల్ గోల్డ్ కొనుగోలు విషయంలో మరో ప్రయోజనం కూడా ఉంది. వివిధ ప్లాట్​ఫామ్​ల ద్వారా డిజిటల్ గోల్డ్​ కొంచెం కొంచెం కొనుగోలు చేసుకోవచ్చు. కొంత మొత్తం బంగారం జమ అయిన అనంతరం బంగారాన్ని డెలివరీ పొందే అవకాశం కూడా ఉంటుంది. భౌతికంగా అయితే బంగారం చిన్న మొత్తాల్లో కొనుగోలు చేయటం కష్టతరం అవుతుంది. ఒకవేళ కొనుగోలు చేసిన అన్నింటిని కలిపే సమయంలో తరుగు లాంటి సమస్య ఉత్పన్నమౌతుంది.

విక్రయించేవి ఇవే..

ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ , సేఫ్ గోల్డ్ తదితర సంస్థలు డిజిటల్ గోల్డ్​ను విక్రయిస్తున్నాయి. ఇవి పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి కార్యకలాపాలు సాగిస్తాయి. పేటీఎం, ఫోన్​పే, గూగుల్​పే వంటి యాప్​లు కూడా మధ్యవర్తులుగా బంగారాన్ని కస్టమర్లకు అందిస్తాయి. ఈ పద్ధతిలో బంగారం నాణ్యత 24 క్యారెట్లు ఉంటుంది.

ఇవి మార్గాలు..

డిజిటల్ పద్ధతుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు పలు మార్గాలు ఉన్నాయి. డిజిటల్ గోల్డ్​ను వివిధ ప్లాట్​ఫామ్​ల నుంచి కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా బంగారం ఆధారంగా ట్రేడయ్యే గోల్డ్ ఈటీఎఫ్​లను కూడా కొనుగోలు చేయొచ్చు. అయితే దీనికోసం డీమ్యాట్ ఖాతా అవసరమనేది గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఆర్​బీఐ అందించే బంగారం సార్వభౌమ పసిడి బాండ్ల(ఎస్​జీబీ)ను కూడా కొనుగోలు చేయొచ్చు. ఎస్​జీబీల ద్వారా వడ్డీ రూపంలో స్థిరపమైన ఆదాయం పొందొచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.