వాహనదారులపై 17వ రోజూ పెట్రో ధరల భారం మోపాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 20 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌పై 50 పైసలకుపైగా ఎగబాకింది.
17 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌పై రూ.8.50, డీజిల్ ధర లీటర్‌పై రూ.10.01 పెరిగింది. వరుస ధరల పెంపుతో దిల్లీ మినహా మిగతా ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.81 నుంచి రూ.86 మధ్య కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
నగరం | పెట్రోల్ (లీ) | డీజిల్(లీ) |
దిల్లీ | రూ.79.80 | రూ.79.44 |
హైదరాబాద్ | రూ.82.77 | రూ.77.58 |
బెంగళూరు | రూ.82.33 | రూ.75.49 |
ముంబయి | రూ.86.52 | రూ.77.74 |
చెన్నై | రూ.83.02 | రూ.76.75 |
కోల్‌కతా | రూ.81.44 | రూ.74.61 |