అగ్రరాజ్యం అమెరికా, చమురు ఉత్పత్తి ప్రధాన దేశాలలో ఒకటైన ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు వరుసగా ఐదో రోజూ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి రూ.75.69కి చేరింది. 2018 నవంబర్ తర్వాత ఇదే అత్యధికం. డీజిల్ ధర 17 పైసలు పెరిగి రూ.68.68కి చేరుకుంది. ఇరాక్పైనా కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించటమూ ధరల పెరుగుదలకు ఆజ్యం పోసింది.
ఇరాన్ జనరల్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. భారత్కు అతిపెద్ద ముడిచమురు సరఫరాదారుగా ఉన్న ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలపై అధిక ప్రభావం చూపుతున్నాయి.
2 శాతం పెరిగిన ముడి చమురు ధర
ముడి చమురు ధరల్లో సైతం భారీగా పెరుగుదల నమోదైంది. బ్యారెల్ ధర దాదాపు 2 శాతం పెరిగి 69.81 అమెరికన్ డాలర్లకు చేరింది.
ఇదీ చదవండి: డిసెంబర్లో పుంజుకున్న సేవా రంగ కార్యకలాపాలు