దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సాధారణ స్థాయివద్ద కొనసాగుతున్న కారణంగా దేశయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నాయి. ప్రధాన మెట్రో నగరాల్లో నేడు లీటర్ పెట్రోల్ ధర 16 నుంచి 17 పైసల వరకూ తగ్గింది. డీజిల్ ధర లీటర్కు 20-22 పైసలు క్షీణించింది. దిల్లీలో నేడు పెట్రోల్ ధరలు 5 నెలల కనిష్ఠ స్థాయికి చేరడం గమనార్హం.
ప్రధాన నగరాల్లో నేటి ధరలు
నగరం | పెట్రోల్ | డీజిల్ | తగ్గుదల (పైసల్లో) |
దిల్లీ | రూ.71.94 | రూ.64.88 | 16/20 |
హైదరాబాద్ | రూ.76.41 | రూ.70.62 | 17/22 |
ముంబయి | రూ.77.57 | రూ.67.94 | 15/21 |
కోల్కతా | రూ.74.54 | రూ.67.15 | 16/20 |
బెంగళూరు | రూ.74.35 | రూ.67.03 | 16/21 |
చెన్నై | రూ.74.69 | రూ.68.47 | 17/21 |
కారణమిదే..
ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను వణికిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి ముడిచమురుకు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు ఏడాది కనిష్ఠ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను... తగ్గిన ముడి చమురు ధరలకు అనుగుణంగా సవరిస్తున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.
ఇదీ చూడండి:చైనాలో ఫ్యాక్టరీలు కూత కూయట్లేదు