ETV Bharat / business

రెండో రోజూ పెట్రో సెగ- రికార్డు స్థాయికి ధరలు - పెట్రోల్​, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగి.. కొత్త రికార్డు స్థాయిని తాకింది. లీటర్​ డీజిల్​ ధర కూడా 25 పైసలు పెరిగింది.

Petrol price hit new record
పెట్రోల్ ధరలు కొత్త రికార్డు
author img

By

Published : Jan 14, 2021, 10:26 AM IST

Updated : Jan 14, 2021, 11:40 AM IST

పెట్రోల్​, డీజిల్ ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. వరుసగా రెండో రోజూ పెట్రోల్ ధర గురువారం (దిల్లీలో) 25 పైసలు పెరిగి.. కొత్త రికార్డు స్థాయి అయిన రూ.84.74 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్​కు 25​ పైసలు పెరిగి రూ.74.92 వద్ద ఉంది.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్​ ధర లీటర్​కు 22 పైసల నుంచి 26 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్​పై 23 పైసల నుంచి 27 పైసల వరకు ఎగిసింది.

ప్రధన నగరాల్లో ధరలు (లీటర్​కు)

నగరంపెట్రోల్డీజిల్
హైదరాబాద్రూ.88.09రూ.81.70
బెంగళూరురూ.87.54రూ.79.39
ముంబయిరూ.91.30రూ.81.58
చెన్నైరూ.87.39రూ.80.17
కోల్​కతారూ.86.14రూ.78.46

అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్​, డీజిల్​ రేట్లను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.

Last Updated : Jan 14, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.