ETV Bharat / business

Petrol price: రికార్డు స్థాయికి చమురు​ ధరలు - మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. ఈ నెలలో ధరలు పెరగటం ఇది నాలుగోసారి. తాజా పెరుగుదలతో దిల్లీలో పెట్రోల్ ధర సరికొత్త రికార్డు స్థాయి అయిన రూ.95.37 వద్దకు చేరింది. డీజిల్ ధర రూ.86.28 వద్ద ఉంది. ఇతర ప్రాంతాల్లోనూ ఇంధన ధరలు నూతన రికార్డు స్థాయిని తాకాయి.

Petrol prices at all-time high
పెట్రో ధరల మంట
author img

By

Published : Jun 7, 2021, 10:03 AM IST

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్​కు రూ.100 దాటగా.. మరిన్ని ప్రాంతాల్లో సెంచరీకి అడుగు దూరంలో ఉంది.

దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం 28 పైసలు పెరిగి.. రూ.95.37 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్​పై 27 పైసలు.. పెరిగి రూ.86.28 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్​, డీజిల్ ధరలు పెంచినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి.

దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లోనూ పెట్రోల్ ధర లీటర్​కు 25-29 పైసల మధ్య, లీటర్ డీజిల్ ధర 26 పైసల నుంచి 30 వైసల వరకు పెరిగింది.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్​కు)

నగరంపెట్రోల్డీజిల్
హైదరాబాద్రూ.99.12 రూ.94.05
బెంగళూరురూ.98.55 రూ.91.46
ముంబయిరూ.101.57 రూ.93.64
చెన్నైరూ.96.77 రూ.90.97
కోల్​కతారూ.95.34 రూ.89.12

ఇదీ చదవండి:కరెన్సీల్లో అమెరికా డాలరే ప్రామాణికం ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.