పెట్రోల్ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 19 పైసల మేర ధర పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీనితో లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ.81.25 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ రూ.73.62 వద్ద స్థిరంగా ఉంది.
అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
ఇతర మెట్రో నగరాల్లోనూ 17 నుంచి 20 పైసల మేర పెట్రోల్ ధర పెరిగింది. డీజిల్ ధరలు మాత్రం గత రెండు వారాలుగా స్థిరంగా ఉన్నాయి.
ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా
నగరం | పెట్రోల్ -లీటర్ | డీజిల్-లీటర్ |
హైదరాబాద్ | రూ.84.44 | రూ.80.23 |
బెంగళూరు | రూ.83.89 | రూ.77.94 |
ముంబయి | రూ.87.92 | రూ.80.17 |
కోల్‌కతా | రూ.82.77 | రూ.77.11 |
చెన్నై | రూ.84.31 | రూ.78.91 |
ఇదీ చూడండి:జూన్‌లో 6.55 లక్షల కొత్త ఉద్యోగాలు