ETV Bharat / business

ఆగని 'పెట్రో' మంట- ఎంత పెరిగిందంటే!

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్​ ధర రూ.82 లను దాటింది. అదే విధంగా పెరిగిన డీజిల్ రూ. 72 చేరుకుంది.

Petrol price crosses Rs 82-mark, diesel above Rs 72 a litre
రూ.82 దాటిన పెట్రోల్​, అదే బాటలో డీజిల్​
author img

By

Published : Nov 28, 2020, 2:10 PM IST

Updated : Nov 28, 2020, 3:26 PM IST

​దేశ రాజధానిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 82లను దాటింది. అదే దారిలో పయనించిన డీజిల్​ కూడా రూ.72కు చేరింది. గత తొమ్మిది రోజుల్లో రేట్లు పెరగడం ఇది ఎనిమిదో సారి. కరోనా వ్యాక్సిన్​కు సంబంధించి సానుకూల వార్తలు రావడం కారణంగా కంపెనీలు పెట్రోల్​ పై 24 పైసలు, డీజిల్​పై 27 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​లు పెరిగిన అంతర్జాతీయ చమురు ధర, విదేశీ మారకపు రేటు ఆధారంగా రోజువారీ పెట్రోల్, డీజిల్ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఇదీ చూడండి: ఇక వాహనాలకూ నామినీ సౌకర్యం

Last Updated : Nov 28, 2020, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.