కరోనా రెండోదశను అదుపు చేసే క్రమంలో విధించిన స్థానిక లాక్డౌన్లతో గత నెలలో ఇంధన అమ్మకాలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఒక్క మే నెలలోనే 17 శాతానికి పడిపోయిట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో పెట్రోల్ అమ్మకాలు 1.79 మిలియన్ టన్నుల మేర పడిపోయినట్లు పేర్కొన్నాయి. గతేడాది మే నెలతో పోల్చితే పెట్రోల్ వినియోగం దాదాపు 13 శాతం అధికంగా ఉండగా.. రెండోదశ కంటే ముందుతో పోల్చితే 28శాతం తక్కువగా నమోదైంది.
ఇదే సమయంలో దేశీయంగా ఎక్కువగా ఉపయోగించే డీజిల్ అమ్మకాలు కూడా గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నాయి. మే నెలలో డీజిల్ డిమాండ్ 4.89 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది 17 శాతం తక్కువ కాగా.. గతేడాది మేతో పోల్చితే 30 శాతం తగ్గింది.
మరోవైపు విమాన ఇంధన అమ్మకాలు కూడా ఏప్రిల్‌తో పోల్చితే 34శాతం తగ్గాయి. వంట గ్యాస్ అమ్మాకాలు కూడా ఆరు శాతం క్షీణించింది.
ఇదీ చూడండి: ఇకపై విద్యుత్ వాహనాలకు ఆర్సీ ఫ్రీ!