ETV Bharat / business

Petrol Price: పండగ రోజూ మోతే- మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్ ధరల (Petrol Price) పెంపు నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. దసరా రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి చమురు సంస్థలు. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

author img

By

Published : Oct 15, 2021, 8:11 AM IST

Petrol Diesel Prices today
పెట్రోల్ ధరలు

దసరా రోజు కూడా పెట్రోల్ ధరల (Petrol Price) నుంచి దేశ ప్రజలకు ఊరట లభించడం లేదు. దిల్లీలో (Petrol Price in Delhi) లీటర్ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.105.14కి చేరగా.. లీటర్ డీజిల్ రూ.93.88కు పెరిగింది.

వాణిజ్య రాజధాని ముంబయిలో (Petrol Price in Mumbai) పెట్రోల్​పై 34 పైసలు, డీజిల్​పై 37 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ.111.05, డీజిల్ ధర రూ.101.74కు చేరుకుంది. చెన్నై, కోల్​కతా, బెంగళూరు నగరాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు అదే స్థాయిలో పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై (Petrol Price today Hyderabad) 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు పంపిణీ సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.109.33, డీజిల్ ధర రూ.102.38కి పెరిగింది.

విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్​పై 31 పైసలు, డీజిల్​పై 37 పైసలు పెరిగింది. (Petrol Price in Vizag) దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.16, డీజిల్ ధర రూ.102.67కు చేరుకుంది.

గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 36 పైసలు అధికమైంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.111.43, డీజిల్ రూ.103.89కు ఎగబాకింది.

ఇదీ చూడండి: 31ప్రతిపాదనలు.. రూ.3,345 కోట్ల పెట్టుబడికి డాట్​ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.