దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో పెట్రోలుపై లీటరుకు 30 పైసలు, డీజిల్పై లీటరుకు 35పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.
దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 89.29, డీజిల్ లీటరు రూ. 79.70కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోలు రు. 95.75, డీజిల్ 86.72గా ఉంది. గత 46 రోజులుగా ముడి చమురు ధరలు 20 శాతం వరకు పెరుగుతున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో మార్పులకు కారణంగానే దేశంలో ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని తెలిపాయి. కొత్త సంవత్సరంలో ఇప్పటివరకు పెట్రోలు, డీజిల్ పై సుమారు రూ. 6 పెంపుదల విధించినట్లు వివరించాయి.
దేశ రాజధానిలో పెట్రోలు, ప్రీమియం పెట్రోలు ధరలు పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సాధారణ పెట్రోలుపై రు. 19 వరకు పెరిగింది.
గతేడాది ఏప్రిల్ నుంచి దిల్లీలో పెట్రోలు, ప్రీమియం పెట్రోలు ధరలు వరుసగా వివరాలు ఇలా..
- ఏప్రిల్ 1, 2020న రూ.69.59, రూ.72.39
- నవంబర్లో రూ.81.06, రూ.84.32
- డిసెంబర్లో రూ.82.34, రూ.85.65
- జనవరిలో 2021 రూ. 83.71, రూ. 87.08
- ఫిబ్రవరిలో రూ.86.30, రూ. 89.77
- ఫిబ్రవరి 16న రూ.89.29, రూ.92.88
ఇదీ చదవండి : త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ!