దాదాపు 18 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కాస్త పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లోనే ధరల్లో మార్పు కనిపించడం గమనార్హం.
దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి.. రూ.90.55 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్కు 18 పైసలు పెరిగింది. దీనితో లీటర్ డీజిల్ ధర రూ.80.91 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అనుగుణంగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.
ఇదీ చదవండి:వయసు 29.. వ్యాపారం రూ.7 వేల కోట్లు!