దేశంలో వరుసగా నాలుగో రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ నెలలో చమురు ధరలు పెరగటం ఇది 6వ సారి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది.
ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోలు రూ. 88.14, డీజిల్ రూ. 78.38 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ రూ. 94.64, డీజిల్ రూ. 85.32 కు చేరాయి.