ETV Bharat / business

వరుసగా 11వ రోజూ 'పెట్రో' బాదుడు - Latest news on fuel price

రోజుకో స్థాయిలో పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్​​ ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. వరుసగా 11వ రోజూ ఇంధన ధరలు పెరిగాయి. లీటర్​ పెట్రోల్(దిల్లీలో)పై 31 పైసలు పెరిగింది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.93.76కు చేరింది.

Petrol and Diesel prices increased again
భగ్గుమంటోన్న పెట్రోల్​ ధరలు- వరుసగా 11వ రోజూ పెంపు
author img

By

Published : Feb 19, 2021, 7:23 AM IST

దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతోంది. వరుసగా 11వ రోజూ ఇంధన ధరలు భగ్గుమన్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్​పై 31 పైసలు, డీజిల్​పై 30 పైసలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం.. దిల్లీలో లీటరు పెట్రోల్​ రూ.90.19 ఉండగా.. లీటరు డీజిల్​ రూ. 80.60గా ఉంది.

ఇక.. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​పై 33పైసలు పెరిగి.. రూ.93.76కు ఎగబాకింది. లీటరు డీజిల్​పై 36 పైసలు వృద్ధి చెంది.. రూ.87.89లకు చేరింది. తాజా పెంపుతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 13 సార్లు చమురు ధరలు పెరిగాయి. ఇలా రోజుకోస్థాయిలో ఇంధన రేట్లు పెరుగుతుండటం వల్ల సామాన్యుడి తలపై మరింత భారం పడుతోంది.

ఇదీ చదవండి: 2-3 ఏళ్లలో తక్కువ ధరకే విద్యుత్​ కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.