ETV Bharat / business

Petrol Price: ఆగని పెట్రో మంట- కొండెక్కిన ధరలు - దేశంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు

దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103కు చేరువైంది. భోపాల్​లో రూ.104.53 వద్దకు చేరింది.

Petrol prices latest update
ఇంధన ధరలు
author img

By

Published : Jun 18, 2021, 8:11 AM IST

Updated : Jun 18, 2021, 9:32 AM IST

దేశవ్యాప్తంగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 96.93, డీజిల్​ రూ. 87.69 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.82గా నమోదైంది. ఇక లీటర్ డీజిల్ ధర 94.84 వద్దకు చేరింది.

రికార్డు ధర..

మధ్యప్రదేశ్​ భోపాల్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.53వద్ద అమ్ముడవుతోంది. లీటర్ డీజిల్ ధర.. రూ.95.75 వద్ద ఉంది.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ.. పెట్రోల్ ధర లీటర్​కు 20-30 పైసల వరకు పెరిగింది. లీటర్​ డీజిల్ ధర సైతం 20 పైసలకు పైగా పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు సంస్థలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  • తెలంగాణ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్​పై 28పైసలు పెరిగి రూ.100.74వద్ద కొనసాగుతోంది. డీజిల్​పై 32పైసలు పెరిగి రూ.95.60గా ఉంది.
  • ఆంధ్రప్రదేశ్​ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌పై 27 పైసలు పెరిగి రూ.102.93వద్దకు చేరింది. డీజిల్‌పై 30 పైసలు వృద్ధి చెంది రూ.97.17 వద్ద అమ్ముడవుతోంది.
  • గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.13 ఉండగా.. డీజిల్‌ రూ.97.37కు చేరింది.
  • ఇక.. విజయవాడలో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.106.48గా నమోదైంది. గుంటూరులో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.106.68గా ఉంది.

ఇవీ చదవండి: పొల్యూషన్​ సర్టిఫికేట్​ ఇక ఇలా ఉండాల్సిందే..

Last Updated : Jun 18, 2021, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.